అక్కడ వైసీపీ 50 కొడితే.. ఇక మళ్ళీ సీఎం జగనే?

praveen
ఎన్నికలు ఎన్నోసార్లు వచ్చాయి పోయాయి. కానీ మునుపేన్నడు లేనంత ఉత్కంఠ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలపై ఉంది. మే 13వ తేదీన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే ఈ ఫలితాలలో జనం ఎవరి వైపు నిలిచారు అన్న విషయం తేలబోతుంది. అయితే ఈసారి ఆంధ్రాలో జనం మెచ్చిన నాయకుడు ఎవరు అవుతారు అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. జగన్ మరోసారి సీఎం అవుతారా లేదంటే కూటమి గెలిచి ఇక చంద్రబాబు సీఎం పీఠాన్ని మరోసారి అదిరోహిస్తారా అన్న విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

 అయితే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు  ఒంటరిగా బరులోకి దిగకుండా జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఇక ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ వైసీపీ మాత్రం తమ పాలనపై నమ్మకం పెట్టుకొని ఒంటరిగానే బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే ఎక్కువ విశ్లేషణలు చూసుకుంటే వైసీపీ రెండోసారి ఆంధ్రాలో అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ ప్రాంతంలో వైసీపీ 50 కొట్టిందంటే.. ఈసారి జగన్ సీఎం అవ్వడం ఖాయమని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 గ్రేటర్ రాయలసీమలో వైసీపీ 50 సీట్లలో విజయం సాధించింది అంటే ఇక ఈసారి ఎట్టి పరిస్థితిలో జగన్ మళ్లీ సీఎం అవుతాడని చెబుతున్నారు విశ్లేషకులు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమ అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉండగా నెల్లూరులో పది నియోజకవర్గాలు ప్రకాశం లో పది నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలా 72 నియోజకవర్గాలలో 50 తప్పకుండా గెలుస్తామని వైసిపి బలంగా నమ్ముతుంది.

 అయితే ఈ 72 స్థానాలలో 50 గెలవడం అసాధ్యమని టిడిపి నమ్ముతుంటే తప్పక 50 సీట్లలో గెలిచి తీరుతామని వైసిపి ధీమాతో ఉంది. ఇలా గ్రేటర్ రాయలసీమలో 50 సీట్లు గెలిస్తే ఉత్తరాంధ్రలో సులభంగా మరో 15 సీట్లలో వైసిపి గెలుస్తుంది.. గోదావరి జిల్లాల్లో 7.. కృష్ణ గుంటూరు జిల్లాలలో 15 నుండి 16 సీట్లు గెలుస్తామని అంచనాలో ఉందట వైసీపీ. ఇలా గ్రేటర్ రాయలసీమలో 50 సీట్లలో విజయం సాధిస్తామని.. ఇక మిగతా ప్రాంతాలలో విజయాలను కలుపుకొని 90 సీట్లలో ఎంతో సులభంగా విజయ డంక  మోగిస్తామని వైసిపి అనుకుంటుందట. దీనిబట్టి రాయలసీమలో 50 సీట్లు గెలిచిందంటే మళ్ళీ సీఎం అయ్యేది జగనే అనే కొంతమంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: