నాగచైతన్య-సమంత విడాకులకు కారణం ఫోన్ ట్యాపింగ్ .. బిజెపి నేత సంచలన కామెంట్స్ ..!
అయితే ఇప్పుడు హఠాత్తుగా మరొకసారి నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం తెరమీదకి తీసుకురావడంతో రాజకీయంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో వినిపిస్తున్నది బిజెపికి చెందిన బూర నరసయ్య గౌడ్ వీరి పైన పలు విషయాలు తెలియజేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత, చైతన్య విడాకులు తీసుకున్నారని ఇప్పటి వరకు ఈ విషయం ఎవరు కూడా ఆరోపించలేదంటూ తెలియజేశారు. నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు చుట్టుకుందంటూ తెలియజేశారు.
తెలంగాణలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలంటూ బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ఈ రోజున నిరసనలతో తెలియజేశారు. ఈ సందర్భంగా బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ సమంత ,చైతన్య విడిపోవడానికి ఇదే ముఖ్య కారణం అంటూ ఫోన్లు ట్యాప్ చేసి వారి యొక్క బెడ్ రూమ్ లలో తొంగి చూస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ విషయాలను మాజీ సీఎం కేసీఆర్ మేనల్లుడు మాజీ మంత్రి హరీష్ రావు ట్యాపింగ్ చేశారని కూడా మరొక సంచలన ఆరోపణలు చేశారు అయితే ఈ బీజేపీ నేత చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పలువు బిఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయాలను ఖండిస్తున్నారు. మరి ఈ విషయాల పైన ఎవరు స్పందిస్తారో చూడాలి మరి