పురంధేశ్వరికి బీజేపీ నేతల వెన్నుపోటు..గెలుపుపై ఆందోళన ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే  పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మరో మూడు రోజుల్లోనే వెలువడనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం కూటమి అలాగే వైసిపి పార్టీలు... గెలుపు పై ధీమాతో ఉన్నాయి. అయితే కొంతమంది సీనియర్ లీడర్లు... గెలుపు పై... కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిలో  ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందరేశ్వరికి మంచి రాజకీయ అనుభవం ఉంది.

 
 ఈమె భవిష్యత్తు మరో మూడు రోజుల్లోనే తేలిపోనుంది. ఇప్పటికే రెండు సార్లు పార్లమెంట్ ఎంపీగా పనిచేశారు పురందరేశ్వరి.  ఇందులో ఒకసారి బాపట్ల నుంచి గెలుపొందగా... మరొకసారి విశాఖపట్నం నుంచి విజయం సాధించారు పురందరేశ్వరి. అయితే ఈసారి రాజమండ్రి బరిలో  ఉన్నారు పురందరేశ్వరి. కూటమి అభ్యర్థన మేరకు... రాజమండ్రి ఎంపీగా పురందరేశ్వరి పోటీ చేశారు.

 
 అయితే 2019 సంవత్సరంలో బిజెపి అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేసిన పురందరేశ్వరి... డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బిజెపికి సపోర్ట్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య అల్లుడి కోసం విశాఖ సీటును... త్యాగం చేసి రాజమండ్రి బరిలో ఉన్నారు పురందరేశ్వరి. కానీ సోము వీర్రాజు... రాజమండ్రి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారట. కాని చివరికి పురందరేశ్వరి లైన్ లోకి వచ్చారు.

 
 ఇక్కడ పురందరేశ్వరికి... సోము వీర్రాజు సామాజిక వర్గం  ఏ మాత్రం సపోర్ట్ చేయలేదట. సోము వీర్రాజు కూడా పురందరేశ్వర్ కి దూరంగా ఉన్నారని సమాచారం. దీంతో రాజమండ్రిలో పురంధరేశ్వరి గెలవడం కష్టమే అంటున్నారు స్థానిక ప్రజలు. సొంత బిజెపి నేతలు వెన్నుపోటు పొడవడం వల్ల... పురందరేశ్వరి  ఓటమి అంచున ఉన్నారని చెబుతున్నారు. పురందరేశ్వరి ఓడిపోతే సోమ వీర్రాజు మళ్ళీ లైన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు అయి ఉండి... పురందరేశ్వరి ఎంపీగా గెలవకపోతే... సోము వీర్రాజుకు అడ్వాంటేజ్ అవుతుందని ఆయన భావించారట. ఇప్పుడు నియోజకవర్గంలో ఇదే చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: