పోస్టల్ బ్యాలెట్ ఘటనలో వాదనలు పూర్తి.. తీర్పు ఎప్పుడంటే..?

lakhmi saranya
పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసిపి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. సుదీర్ఘ వాయిదాల అనంతరం విచారణను ధర్మసనం శనివారానికి వాయిదా వేయడం జరిగింది. శనివారం సాయంత్రం అనగా నేడు ఆరు గంటలకు తీర్పు వెల్లడించనుంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి జారీ చేసిన మెమోను రద్దు చేయాలని వైసిపి నేతలు గురువారం మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై విచారణను సాగించిన ధర్మసనం శుక్రవారం కి వాయిదా వేసింది.
ఇక తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. కాగా ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఈ ప్రక్రియ మే 4 నుంచి 9 వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నాలుగు లక్షల 404 వేల 2016 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన మెమో ను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముకేశ్‌ కుమార్ మీనా జారీ చేశారు. ఈ మెమో పై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శలకు విరుద్ధంగా ఉందంటూ వైసిపి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సిఈవో జారీ చేసిన మెమో ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది వైసిపి నేతలు ‌ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: