మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన రాబోతుంది. దానితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలు అయినటువంటి వైసీపీ , కూటమికి దానిని అభిమానించే వ్యక్తులకు అలాగే ఆ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు జూన్ 4 వ తేదీన ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని టెన్షన్ ఫుల్ గా ఉంది. రాబోయే రిజల్ట్ గురించి కాస్త టెన్షన్ పడుతున్న కొన్ని సీట్లను మాత్రం ఇప్పటికే ఈ రెండు ప్రధాన వర్గాలు వదిలేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎందుకు అంటే కొన్ని ప్రాంతాలలో అపోజిషన్ ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని వల్ల అక్కడ నిలబడే ఆపోజిట్ వ్యక్తి కొంత స్ట్రాంగ్ కాకపోయినా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో గెలుపొందం అని ఏ వర్గానికైనా తెలుస్తూ ఉంటుంది. అలాగే కూటమి కూడా అరకు సీటును ఆల్మోస్ట్ వదిలేసుకున్నట్లే తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సారి తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉన్న పార్టీలలో ఒకటి అయినటువంటి తెలుగు దేశం భారీ మొత్తంలో సీట్లను దక్కించుకుంది.
ఆ తర్వాత జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆ తర్వాత బిజెపి పార్టీకి సీట్లు వచ్చాయి. ఇకపోతే అందులో భాగంగా అరకు అసెంబ్లీ స్థానాన్ని బిజెపి కి కేటాయించారు. మొదటి నుండి ఈ ప్రాంతంలో బిజెపి అభ్యర్థి గెలవడం కష్టమే అని కూటమి అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా రేగం మత్స్యలింగం పోటీలోకి దిగారు. పోయిన సారి కూడా ఇక్కడ వైసిపి అభ్యర్థి గెలుపొందారు. కానీ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ను కాకుండా వేరే వారిని ఇక్కడి నుండి బరిలోకి దించారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినా మంచి క్రేజ్ ఉండడంతో పంగి రాజారావు ఇక్కడి నుండి ఆల్మోస్ట్ ఓడిపోవడం కాయం అని చాలా మంది అంచనా వేస్తున్నారు.