ఏపీ: ఈసారి గెలుపు వారిదే... ఎన్నికల ఫలితాలపై స్పందించిన దర్శకుడు రవిబాబు!

Suma Kallamadi
రాబోయే ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇక విపక్షాలు అయితే ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా గెలుపు మాదేనంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే, ఈసారి ఏదిఏమైనా మేమే గెలవబోతున్నాం అని టీడీపీ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఎవరి లెక్కలు ఏమిటో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. అయితే వాస్తవానికి ఈసారి ఓటరునాడి ఏమిటనేది మాత్రం అంతుచిక్కడం లేదనేది సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ఈసారి సైలెంట్ పోలింగ్ జరిగింది. అది ఏ వర్గానికి వరంలాగా మారబోతోందో చెప్పడం ఒకింత కష్టంగా మారిందని చెప్పుకోవాలి.
అవును, రాజకీయ పార్టీలు తమదే గెలుపు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొంతమంది రాజకీయనేతలు, వ్యూహకర్తలు, సినిమా ప్రముఖులు చేస్తున్న ప్రకటనలు, కామెంట్లు అనేవి మరింత రాజకీయ వేడిని పెంచుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ రవిబాబు ఏపీ రాజకీయాలపై స్పందించగా ప్రస్తుతం అది కాస్త హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవచ్చనే దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రవిబాబు.. రాబోయే ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవచ్చనే దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా రవిబాబు యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయదుందుభి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈసారి చంద్రబాబు విజయాన్ని ఎవరూ ఆపలేరని, నాలుగోసారి సీఎం అవుతారని బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా టీడీపీ కూటమికి 150 సీట్లకు ఏ మాత్రం తగ్గవని రవి బాబు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని రవిబాబు ఆకాశానికెత్తేసాడు. ఈ 70 ఏళ్ల వయసులోనూ రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తారంటూ చంద్రబాబును మెచ్చుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కాగా డైరెక్టర్ రవి బాబు గతంలో టీడీపీ పార్టీకి పని చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: