ఏపీ ఎలక్షన్స్.. తొలి ఫలితం వచ్చేది ఇక్కడే?
అయితే ఏపీలో ఈసారి పోలింగ్ శాతం కూడా పెరగడంతో ఈ పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ప్లస్ కాబోతుంది అన్న విషయం గురించి కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో సర్వే రిపోర్టులు తెరమీదికి వచ్చి సంచలనంగా మారిపోయాయి. ప్రజలందరినీ కూడా మరింత కన్ఫ్యూజన్లో పడేసాయ్. ఎందుకంటే కొన్ని సర్వే రిపోర్టులు కూటమి గెలుస్తుందని చెబితే మరికొన్ని రిపోర్టులు అటు వైసిపి మరోసారి అధికారాన్ని చేపడుతుందని చెప్పకనే చెప్పాయి. అయితే ప్రజలు ఏం నిర్ణయించారు అన్న విషయం మాత్రం జూన్ 4వ తేదీన కౌంటింగ్ తర్వాత ఫలితాలలో తేలబోతుంది అని చెప్పాలి.
అయితే కౌంటింగ్ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. కౌంటింగ్ సమయంలో ఫలితాలను తారుమారు చేసే అవకాశము ఉండడంతో అందరూ అప్రమత్తమయ్యారు. అయితే రాష్ట్రంలో తొలి ఫలితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లేదా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోను 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఫలితాలు చివరిగా వెలువడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ రెండు స్థానాలలో దాదాపు 29 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. వీటితోపాటు భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.