ఆరా మ‌స్తాన్‌: ప‌వ‌న్‌, బాల‌య్య‌, బాబు, లోకేష్ బంప‌ర్ విక్ట‌రీ..!

Divya
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మే 13 వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే అటు అధికార పార్టీ వైసిపి ఇటు కూటమి ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తామంటూ వెల్లడించారు.. అయితే తాజాగా ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు.. ఇందులో భాగంగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని వెల్లడిస్తూనే.. ఏ పార్టీ ఎన్ని సీట్లతో ప్రభంజనం సృష్టిస్తుంది అనే విషయాన్ని కూడా తాజాగా ఆరా మస్తాన్ అనే సర్వే తేల్చి చెప్పింది.. గతంలో కూడా దాదాపు ఈ సర్వే చెప్పిన ప్రకారమే పార్టీలు సీట్లను సొంతం చేసుకోవడం జరిగింది.
ఇక అందులో భాగంగానే ఆరా మస్తాన్ సర్వే తెలిపిన ప్రకారం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ,బాలకృష్ణ , లోకేష్ తమ తమ నియోజకవర్గాలలో విక్టరీ సాధిస్తారని స్పష్టం చేసింది. కూటమి తరపున కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు విక్టరీ సాధిస్తారని.. మరోవైపు మంగళగిరిలో అసలు ఊసే లేని లోకేష్ అధికారంలోకి వస్తారని ఆరా సర్వే స్పష్టం చేసింది. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ తన టాలెంట్ నిరూపించుకొని అధికారంలోకి వస్తారని తెలిపిన ఆరా సర్వే.. బాలకృష్ణ ఎప్పటిలాగే హిందూపురంలో అధికారంలోకి వస్తారని స్పష్టం చేసింది..

అయితే కూటమి తరుపున ముఖ్యమైన వారు  అధికారంలోకి వస్తారని చెప్పిన ఆరా సర్వే.. ఓవరాల్ గా చూసుకుంటే 71 నుంచి 81 సీట్లతో మాత్రమే కూటమి సరిపెట్టుకుంటుంది అని.. అటు వైయస్సార్ పార్టీ 94 నుంచి 104 సీట్లతో అఖండ విజయం సాధించి అధికారంలోకి వస్తుంది అని తెలిపింది. ఓవరాల్గా వైసిపి పార్టీ విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ సర్వే స్పష్టం చేసింది . ఈ విషయంతో వైసిపి నాయకులలో సంబరాలు మొదలయ్యాయి. ఇక పూర్తి ఫలితాలు తెలియాలి అంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: