ఈ స‌ర్వేల్లో దుమ్ములేపిన కూట‌మి...ఇక ఆపడం కష్టమే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సర్వే సంస్థలు వైసిపి పార్టీకి అనుకూలంగా... ఎడ్జ్ ఇస్తే... మరికొన్ని సర్వే సంస్థలు  తెలుగుదేశం కూటమికి  ఫలితాలను అనుకూలంగా ఇచ్చాయి.
 
 అయితే ఓవరాల్ గా ప్రముఖ  ఆరు సర్వే సంస్థలు  మాత్రం కరాకండిగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చి... వైసిపి పార్టీకి  షాక్ ఇచ్చాయి ఈ ఆరు సర్వే సంస్థలు. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైజ్ అనే సర్వే సంస్థ... తెలుగుదేశం కూటమికి ఏడ్జ్ ఇచ్చింది. ఈ సర్వే సంస్థ ఎగ్జిట్ ఫలితాల ప్రకారం... తెలుగుదేశం కూటమికి 113 నుంచి 122 స్థానాలు వస్తాయట. అలాగే వైసిపి పార్టీకి... 48 స్థానాల నుంచి 60 స్థానాలు వస్తాయని తెలిపింది.
 
జనగలం అనే సర్వే సంస్థ తెలుగుదేశం కూటమికి 104 స్థానాల నుంచి 118 స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఇక వైసిపి పార్టీకి 44 స్థానాల నుంచి 57 స్థానాలు మాత్రమే వస్తాయని ఈ సర్వే సంస్థ అంచనా వేసింది. అటు చాణక్య స్ట్రాటజీస్  అనే సర్వే సంస్థ తెలుగుదేశం కూటమికి 114 నుంచి 125 స్థానాలు ఇచ్చి... తెలుగు తమ్ముళ్లకు ఊరట ఇచ్చింది.  అటు వైసిపి పార్టీకి 39 నుంచి 49 స్థానాలు రానున్నాయి.
 
పయనీర్ అనే సర్వే సంస్థ తెలుగుదేశం పార్టీకి ఏకంగా 144 స్థానాలు వస్తాయని తెలిపింది. అటు వైసిపి పార్టీకి కేవలం 31 స్థానాలు వస్తాయని పేర్కొంది. కేకే సర్వీస్  అనే సర్వే సంస్థ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలను ఇచ్చింది. ఈ సర్వే ఎగ్జిట్ ఫలితాల ప్రకారం తెలుగుదేశం కూటమికి ఏకంగా 161 స్థానాలు వస్తాయని తెలిపింది. అటు వైసీపీ పార్టీకి కేవలం 14 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: