ఆరా మస్తాన్ సర్వే.. ఓడిపోయే వైసీపీ మంత్రులు వీరే?

praveen
ఏపీలో ఈసారి అధికారం ఎవరిది.. ఇదే విషయంపై గత కొంతకాలం నుంచి ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసారి ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే లక్ష్యంతో అటు కూటమి.. ఇంకోవైపు వైసీపీ పార్టీలు తీవ్రంగానే శ్రమించాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీల గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు అని చెప్పాలి. అయితే ఇలా పైపైకి ధీమాతో ఉండమని చెబుతున్న.. లోలోపల మాత్రం ప్రజలు ఏం తీర్పుని ఇచ్చారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

 ఈ క్రమంలోనే అందరూ ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఇక నేడు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో సంస్థలు ఏపీలో అధికారం ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై తమ సర్వే రిపోర్టులు చెప్పాయి. ఈ క్రమంలోనే కొన్ని సర్వే రిపోర్టులు అటు కూటమి అధికారం చేపడుతుందని చెబితే.. ఇంకొన్ని సర్వే రిపోర్టులు ఏపీలో అటు వైఎస్సార్సీపీదే మరోసారి అధికారం అంటూ తేల్చి చెప్పాయ్. అయితే ఇక ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైసీపీ ఏకంగా 104 సీట్లలో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపడుతుందని చెప్పారు. అటు కూటమి 71 నుంచి 81 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేశారు.

 అయితే ఆంధ్రాలో అటు వైసిపి ఇలా మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ  వైసీపీ పార్టీలో కీలక నేతలుగా ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారు కొంతమంది ఓటమిపాల అవుతారని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చెపుతుంది. నగరి ఎమ్మెల్యే రోజా, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, గాజువాక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, రాజమండ్రి ఆర్ ఎమ్మెల్యే చెల్లపోయిన వేణు, కొండేసి ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, పెనుకొండ ఎమ్మెల్యే ఉషశ్రీ, గుంటూరు ఎమ్మెల్యే విడుదల రజీని, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని ఆరా మస్తాన్ సర్వే చెబుతుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే రమేష్.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి పోటీ ఎదుర్కొంటారు అంటూ ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: