వైసీపీపై షర్మిల ఎఫెక్ట్ ఎంతంటే... ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఇదే?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో...  కాసేపటి క్రితమే ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయి.  జాతీయ అలాగే లోకల్ సర్వే సంస్థలు కూడా తమ ఎగ్జిట్ పోల్  ఫలితాలను రిలీజ్ చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ రిపోర్టు ప్రకారం కేంద్రంలో మోడీ సర్కార్ ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తేలిపోయింది.. అయితే ఈ ఎగ్జిట్ ఫలితాలు నేపథ్యంలో వైయస్ షర్మిల కు ఊహించని షాక్ తగిలింది.

 
 కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వైయస్ షర్మిల దారుణంగా ఓడిపోబోతున్నట్లు ఆరా సర్వే సంస్థ  సర్వే వెల్లడించింది. కడప నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా షర్మిలకు రావాలని స్పష్టం చేసింది. కడప ఎంపీగా మరోసారి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు తేలిపోయింది   మిగతా సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.

 
 అయితే కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల దాదాపు మూడు స్థానాలలో వైసిపి ఓడిపోయే పరిస్థితి నెలకొందట. ఈ విషయాన్ని కూడా ఆరా సర్వే సంస్థ వెల్లడించింది. అయితే ఆ మూడు స్థానాలు ఎంపీ ఆ లేక ఎమ్మెల్యేనా  అనేది మాత్రం ఆ సర్వే సంస్థ తెలిపాలేకపోయింది. కానీ షర్మిల ప్రభావం మాత్రం ఏపీలో ఎక్కడ కూడా కనిపించలేదని... జగన్కు షర్మిల వల్ల ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది.

 
 ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల... కొన్ని రోజులకే ఏపీకి వెళ్లిపోయింది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి... ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకం అయ్యారు షర్మిల. దీంతో.. కాంగ్రెస్కు మంచి ఊపు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత సర్వే లెక్కలు చూస్తుంటే... ప్రభావం ఎక్కడ కనిపించలేదని తెలిసిపోతుంది. అయితే ఈ ఎగ్జిట్ ఫలితాలు నిజం అవుతాయా లేదా అనేది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: