జర్నలిస్ట్ సాయి:ఎగ్జిట్ పోల్స్ ని నమ్మవచ్చా..??
2014 ఎన్నికల్లో మేము ఒక్కళ్ళం మాత్రమే తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పాము.మిగతా వాళ్ళు ఆరోజు చూస్తే ఎన్డీటీవీ తెలుగుదేశం పార్టీ 75 నుంచి 95 స్థానాలు సాధిస్తే వైసీపీ 50 నుంచి 100 వస్తుంది అని చెప్పి అంచనా వేసింది. అప్పుడు రెండే రెండు ఛానల్స్ వాళ్ళు సర్వే చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వైసిపి రాలేదు. అలాగే ఎన్ టీవీ వేసిన సర్వే కూడా అప్పుడు ఫెయిల్ అయింది. ఒక్క జెమిని టీవీ మాత్రమే టిడిపి 129 నుంచి 135 స్థానాలతో అధికారంలో వస్తుందని తేల్చి చెప్పింది.అలాగే 2019లో చూసుకుంటే సిపిఎస్ అట్లాగే విడిపి అసోసియేట్, ఆరా, ఇండియా టుడే నలుగురు కూడా సక్సెస్ అయ్యారు లేకపోతే ఎగ్జాట్ ఫిగర్ కాదు, కానీ గెలిచేది వైసిపి అని చెప్పారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వస్తుందని ఐ ఎన్ ఎస్ ఎస్ అంచనా వేసింది. అది కాస్త ఫెయిల్ అయింది. మిగతా నాలుగు కూడా సక్సెస్ అయ్యాయి. అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంటు స్థానాలు చూస్తే ఇండియా టుడే, న్యూస్ 19, రిపబ్లిక్, సి ఓటర్, టైమ్స్ నౌ, టుడేస్ చాణిక్య, అందరిలో కూడా సక్సెస్ అయింది ఇండియా టుడే ఒకటి మాత్రమే.కచ్చితంగా దేశం మొత్తం మీద ఇవే వస్తుంది అని చెప్పలేము. దగ్గర దగ్గరగా సర్వేలన్నీ ఒకే మాదిరిగానే ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూసుకోవాలి.