ఆంధ్రా అసెంబ్లీ : ఈ నేతలు లేకపోతే...సినిమా అట్టర్‌ ఫ్లాఫ్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో...శనివారం రాత్రి ఎగ్జిట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో...ఎగ్జిట్ ఫలితాలను రిలీజ్ చేశారు. అయితే ఈ ఎగ్జిట్ ఫలితాల లెక్కల ప్రకారం... కొన్ని సర్వే సంస్థలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. మరి కొన్ని సంస్థలు వైసిపికి అనుకూలంగా ఇచ్చాయి.

అయితే ఆరా మస్తాన్ అనే సర్వే... ఏపీలో వైసీపీ పార్టీ గెలవబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వైసీపీలో ఓడిపోయే మంత్రుల వివరాలను కూడా వివరించింది. ముఖ్యంగా... ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా, గుడివాడ అమర్నాథ్, విడుదల రజిని, అప్పలరాజు, అంబటి రాంబాబు  లాంటి ఫైర్ బ్రాండ్లు... ఈసారి అసెంబ్లీలో కనిపించబోరని సమాచారం. ఆరా మస్తాన్ సర్వే ఇదే తేల్చి చెప్పింది.

అటు పేర్ని నాని ఈసారి పోటీ చేయకుండా తన కొడుకుని బరిలో ఉంచారు. ఆయన కొడుకు గెలిచినా పేర్ని నాని అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ లేదు. ఇటు కొడాలి నాని, వల్లభనేని వంశీ  లాంటి కీలక నేతలు గెలవడం కూడా  చాలా కష్టమని కొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. అయితే ఇలా ఓడిపోయే మంత్రులు, మాజీ మంత్రులు అందరూ... గత ఐదు సంవత్సరాలలో... తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో ఒక ఆట ఆడుకున్నారు.

చంద్రబాబు మాట్లాడేటప్పుడు కౌంటర్లు... కిలకిల నవ్వులు, ర్యాగింగ్ చేస్తూ... అసెంబ్లీలో నానా రచ్చ చేసేవారు  ఈ వైసీపీ నేతలు. అసలు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా... చిందర వందర చేసేవారు. ఇలా వైసిపి నేతలు మాట్లాడడం వల్ల ఒకసారి చంద్రబాబు నాయుడు మీడియా ముందే ఏడ్చేశారు. ఇంత రచ్చ చేసిన అలాంటి నేతలు... ఈసారి గెలవబోరని... సర్వే సంస్థలు తెలుపుతున్నాయి.
అయితే అలాంటి నేతలు లేకపోతే... ఏపీ అసెంబ్లీలో... సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని  కొంతమంది బాధపడుతున్నారు. అలాంటి నాయకులు ఉంటేనే మజా ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. పవన్ కళ్యాణ్,  నారా లోకేష్ ఈసారి కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అలాంటి వారికి దీటుగా సమాధానం ఇచ్చే వైసిపి నేతలు.... ఈసారి గెలవకపోవడం... జగన్మోహన్ రెడ్డికి మైనస్ అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: