అసెంబ్లీ కొత్త సినిమా: బాలయ్య హ్యాట్రిక్.. పంచ్ దెబ్బలకి అసెంబ్లీ గడగడ..!

Divya
•బాలయ్య దెబ్బకు అసెంబ్లీలో దబిడి దిబిడే
•హ్యాట్రిక్ కొట్టనున్న  బాలయ్య
•బాలయ్య ధాటికి జగన్ తట్టుకుంటారా


(ఏపీ అసెంబ్లీ - ఇండియా హెరాల్డ్)

హిందూపురం కి కంచుకోటగా మారిన టిడిపి.. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.  ఇక అందులో భాగంగానే 2014 నుంచి నందమూరి బాలకృష్ణ టిడిపి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.. 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికైన బాలకృష్ణ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చారు.. ముఖ్యంగా హిందూపూర్ ను అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లిన ఘనత ఈయనదే అని చెప్పాలి.. ఇంటింటికి అన్ని ఆరోగ్య సదుపాయాలతో పాటు మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తూ హిందూపూర్ ప్రజలకు అండగా నిలిచారు. ఇక ఈసారి కూడా ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పోటీకి దిగారు బాలకృష్ణ..

అయితే ఈసారి కూడా గెలుస్తారు కానీ అనుకున్నంత స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.. పైగా పరిపూర్ణానంద స్వామి  ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడడంతో కొన్ని సామాజిక వర్గాల ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.. మరొకవైపు వైసీపీ తరఫున దీపికా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీపిక బాలకృష్ణ హోరాహోరీగా పోటీపడుతున్న నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్గా బరిలోకి దిగడం వల్ల ఆయనకు వచ్చే సామాజిక ఓట్ల వల్ల బాలకృష్ణకు ఎటువంటి ఇబ్బంది లేదు.. దీపికాపై ఆ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక తాజాగా నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల అవ్వగా దాదాపు అన్ని ప్రముఖ సర్వేలు బాలకృష్ణ అధికారంలోకి వస్తారని స్పష్టం చేశాయి.

ఇక ఈసారి వెనుక బాలకృష్ణ విజయం సాధిస్తే ఇక ఆయన హ్యాట్రిక్ కొట్టినట్టే. ఇక హ్యాట్రిక్ కొట్టి అసెంబ్లీలోకి అడుగుపెడితే .. ఆయన ప్రభంజనం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. అసలే తన సినిమాలతో భారీ పంచ్ డైలాగ్ లతో రాజకీయ నాయకులను సైతం టార్గెట్ చేస్తూ.. ఆయన విసిరే డైలాగులకు సినిమా థియేటర్లలో ఈలలు చప్పట్లతో మారుమ్రోగుతూ ఉంటాయి. అలాంటిది హ్యాట్రిక్ విజయాన్ని అందుకొని అసెంబ్లీలోకి అడుగుపెడితే ఇక ఆయన ధాటికి ఒకవేళ వైయస్ వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తట్టుకుంటుందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. మొత్తానికి అయితే బాలయ్య హ్యాట్రిక్ కొట్టి అసెంబ్లీలో మరో కొత్త సినిమా చూపించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికైతే ఈసారి అసెంబ్లీలో చాలామంది కొత్తవాళ్లు అడుగుపెట్టబోతున్నారు మరి ఇక్కడి సినిమా నిజంగా ప్రజలకు వినోదాన్ని ఉత్కంఠను కలిగిస్తుందని అప్పుడే ప్రజలు ఊహించేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: