నారా లోకేష్ వారిని సాటిస్ఫై చేయడంలో సక్సెస్ అయ్యేనా..?

Pulgam Srinivas
తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇకపోతే ఈయన 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగారు. ఈయన తెలుగు దేశం పార్టీ లో అత్యంత కీలక వ్యక్తి కావడం , అలాగే చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో లోకేష్ అవలీలగా గెలుపొందుతారు అని అంతా అనుకున్నారు.

కానీ ఈయన మంగళగిరి నుండి 2019 వ సంవత్సరం అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. ఇక 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో కూడా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. ఇకపోతే ఈయన 2019 వ సంవత్సరంలో ఓడిపోయినా కూడా అప్పటి నుండి కొన్ని రోజుల క్రితం జరిగిన ఎలక్షన్ల వరకు ఈ నియోజకవర్గ పై పని చేయడం , ఎంతో మంది కార్యకర్తలను కలవడం , గ్రౌండ్ రిపోర్ట్ చేయడం , అలాగే ఎలక్షన్ల సమయంలో కూడా ఈ ప్రాంతం పై ఫుల్ ఫోకస్ పెట్టడంతో ఈయన గెలుపు ఖాయం అని మొదటి నుండే అనేక మంది అంటున్నారు.

ఇక తాజాగా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ వచ్చాయి. వాటిలో కూడా మంగళగిరి నుండి నారా లోకేష్ విజయం కన్ఫామ్ అని దాదాపు అన్ని సంస్థలు చెప్పాయి. ఇక అక్కడి జనాల అంచనా , ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఈయన ఆల్మోస్ట్ గెలవబోతున్నాడు. దానితో లోకేష్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఎప్పటి నుండో తెలుగుదేశం నేతలు , కార్యకర్తలు , అభిమానులంతా నారా లోకేష్ అసెంబ్లీలోకి అడుగుపెడితే అపోజిషన్ గ్యాంగ్ కి చుక్కలు చూపిస్తాడు అని భావిస్తున్నారు. మరి వారందరి అంచనాలను లోకేష్ అందుకొని తెలుగుదేశం నేతలు , కార్యకర్తలు , అభిమానులను సాటిస్ఫై చేస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: