తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఈయన 2014 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుండి పోటీలోకి దిగాడు. ఆ టైమ్ లో తెలుగుదేశం పార్టీకి ఫుల్ వేవ్ ఉండడం , అలాగే బాలకృష్ణ మొట్ట మొదటి సారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం , ఇలా అనేక అంశాలు కలిసి వచ్చి ఈయన భారీ మెజారిటీతో హిందూపురంలో గెలుపొందారు. ఇక 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి పోటీలోకి దిగారు.
ఈ సారి తెలుగుదేశం పార్టీ కి రాష్ట్రమంతా ఫుల్ నెగిటివ్ ఉంది. అలాంటి సమయంలో కూడా హిందూపురం నియోజకవర్గం నుండి బాలకృష్ణ గెలుపొంది తన స్టామినా ఏంటి అనేది నిరూపించుకున్నాడు. ఇకపోతే 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో కూడా హిందూపురం నుండే బాలకృష్ణ బరిలో నిలిచారు. ఇక ఏదో ఒకటి రెండు ప్రచారాలను తప్పిస్తే ఇక్కడ పెద్దగా ప్రచారాలు కూడా బాలయ్య చేయలేదు.
కానీ ఈయనే ఈసారి భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పుకొచ్చాయి. ఇక ఈ సర్వే రిపోర్ట్ ను బట్టి చూస్తే బాలయ్య మూడవ సారి కూడా గెలవడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లే అని చెప్పవచ్చు. ఇక ఈ గెలుపులను పక్కన పెడితే బాలకృష్ణ మీటింగ్ లలో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై చేయి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా జరిగిన ప్రతిసారి బాలకృష్ణకు కోపం ఎక్కువ , అలాంటి వాడిని గెలిపించడం ఎందుకు అని ప్రతిపక్షాలు ఎన్నో వాక్యాలు చేస్తూ వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన తీరులో తను దూసుకుపోతున్నాడు.
కొన్ని సందర్భాలలో అతను వ్యక్తులపై చేయి చేసుకున్న మిగతా పరిస్థితులలో మాత్రం ఆయన గ్రేట్ , పార్టీ అధికారంలో ఉన్న , లేకపోయినా హిందూపురం విషయంలో ఆయన డెవలప్మెంట్ అద్భుతం అని అక్కడి ప్రజలు వరుసగా బాలకృష్ణ కే ఓట్లు వేసి ఆయనను గెలిపించడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరేమన్నా ... ఎవరేమైనా బాలకృష్ణ మాత్రం తన పంధాలో తాను దూసుకుపోతూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.