సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల లైవ్ విసులుబాటు.. బుకింగ్స్ షురూ..!

lakhmi saranya
దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పోలింగ్ సమరం నిన్న అనగా జూన్ 1తో సమాప్తం అయ్యింది. ఈ ఎన్నికలలో చివరిదైనా ఏడో దశ పోలింగ్ నిన్న ముగిసింది. ఇక ముగిసింది ఓట్ల లెక్కింపు మాత్రమే. ఫలితాలు తెలియాలంటే జూన్ 4వ తారీకు వరకు ఆగాల్సిందే. అయితే ఈసారి కొన్ని సినిమా థియేటర్లు కూడా ఎన్నికల ఫలితాల లైవ్ను స్ట్రీమింగ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని నగరాల్లో టికెట్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
ఎలక్షన్ రిజల్ట్స్ 2024 పేరుతో ఈ ఫలితాల లైవ్లో జూన్ 4న కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రసారం చేయనున్నాయి. ప్రస్తుతం ముంబై, న్యూఢిల్లీ, పూణే నగరాల్లో ఈ ఎలక్షన్ షో లా కోసం థియేటర్లలో టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కూడా మొదలయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల లైవ్ను ఏ థియేటర్ అయినా ప్రదర్శిస్తాయా లేదా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాల లైవ్ కోసం థియేటర్లు కేటాయింపు లేదు. ప్రజెంట్ ముంబై అండ్ ఢిల్లీ, పూణే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ షోలు ఉన్నాయి.
జూన్ 4న ఎన్నికల ఫలితాల లైవ్ షో థియేటర్లలో ఆరు గంటల పాటు ఉండనుంది. ఉదయం 9 గంటలకు ఇది మొదలవుతుంది. ముంబై, ఢిల్లీ, పూణేలో ఇప్పటివరకు బుకింగ్స్ ఓపెన్ అయిన థియేటర్లలో ఈ ఎన్నికల షో టికెట్ ధరకు రూ. 99 నుంచి 300 మధ్య ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్లు పెద్దగా లేవు. ఈ క్రమంలోనే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అక్కడ వారు. దీంతో ఈ డ్రై పీరియడ్లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు కొన్ని థియేటర్లు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి థియేటర్లలో మంచి ఆదరణ దక్కింది. దీంతో ఎన్నికల ఫలితాల లైవ్ షోలు వేసేందుకు కొన్ని థియేటర్లు ముందుకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: