C-PAC: కారు జోరు... గులాబీ పార్టీకి 11 ఎంపీలు..?

Veldandi Saikiran
భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో... శనివారం సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఎగ్జిట్ ఫలితాలలో... గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. లోకల్ సర్వే సంస్థలు, నేషనల్ సర్వే సంస్థలు... ఇలా ఏ సర్వే సంస్థ చూసుకున్నా కూడా... గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేలా...ఫలితాలు ఇచ్చాయి. ఉద్యమ పార్టీ అయిన గులాబీ పార్టీ అసలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో... ఖాతా కూడా ఓపెన్ చేయదని... చాలా సర్వేలు తెలిపాయి.

ఇక మరికొన్ని సర్వే సంస్థలు అయితే... గులాబీ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుస్తాయని స్పష్టం చేశాయి. మరికొన్ని గులాబీ పార్టీ... ఒకే ఒక్క సీటు గెలుస్తుందని స్పష్టం చేశాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో... గులాబీ పార్టీకి ఊపిరి పోసేలా... ఓ సర్వే సంస్థ రిపోర్టును బయటపెట్టింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా గులాబీ పార్టీ 11 స్థానాలు గెలుచుకోబోతున్నట్లు... సర్వే సంస్థ వెల్లడించింది. ఆ సర్వేని సి ప్యాక్  సివిక్ పోల్స్.

ఈ సర్వే సంస్థ జాతీయ స్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ సి ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... గులాబీ పార్టీకి 11 ఎంపి స్థానాలు వస్తాయని తేలిపోయింది. ఇందులో బిజెపి పార్టీకి రెండు స్థానాలు... కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం వస్తుందని స్పష్టం చేసింది.  హైదరాబాద్ సీటును ఎంఐఎం పార్టీ  కైవసం చేసుకోబోతున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ... వంద రోజుల్లోనే చుక్కలు చూపించిందని ప్రజలు ఆలోచనలో ఉన్నారట.

ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి  వ్యతిరేకంగా ఓటు వేసే క్రమంలో... గులాబీ పార్టీని గెలిపించుకునేందుకు చాలా మంది... కెసిఆర్ సపోర్ట్ గా నిలిచారట. ఈ తరుణంలోని గులాబీ పార్టీకి ఇంత స్థాయిలో సీట్లు రాబోతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. జహీరాబాద్, మెదక్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, వరంగల్, మహబూబాబాద్ ఖమ్మం, నాగర్ కర్నూల్, చేవెళ్ల, పెద్దపల్లి స్థానాలను గులాబీ పార్టీ దక్కించుకుంటుందని సి బ్యాంక్ ఎగ్జిట్ ఫలితాలను రిలీజ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: