కేసీఆర్ పనైపోయిందన్నారుగా : తెలంగాణా బాపూ ఇక్కడ!

praveen
గత అసెంబ్లీ ఎన్నికలు నాటి నుంచి కూడా గులాబీ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి హ్యాట్రిక్ కొడతాము అని ధీమాతో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలందరూ కూడా షాక్ ఇచ్చారు. ఏకంగా కనుమరుగవుతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ అందించి అధికారంలోకి తీసుకువచ్చారు. దీంతో రెండు సార్లు వరుసగా అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. చివరికి ప్రతిపక్షంతోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.


 అయితే బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో చివరికి ఆ పార్టీలోని కీలక నేతలందరూ కూడా పార్టీని వీడిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్ఫలితాలు వస్తాయనుకుంటే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బిఆర్ఎస్ ఒకటి కూడా గెలుచుకునే అవకాశం లేదని చెప్పడంతో ఆ పార్టీ నేతలు అందరిలో కూడా ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో ఇక గులాబీ పార్టీ నేతలు అందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.


 కసిరెడ్డి నారాయణరెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉండగా.. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో.. చివరికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. అయితే కాంగ్రెస్ నుంచి  జీవన్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ ప్రధాన పోటీదారులుగా బరిలో నిలిచారు. మొత్తంగా 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి  జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇలా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs

సంబంధిత వార్తలు: