ఏపీ: వైసీపీకి అతిపెద్ద షాకిచ్చిన ఆరా మస్తాన్ సర్వే..??

Suma Kallamadi
ఆరా మస్తాన్ సర్వే తెలిపే ఫలితాలు చాలా వరకు నిజమవుతాయి. ఈసారి ఆయన నరసాపురం ఎంపీ, అనకాపల్లి ప్రాంతాల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది అని చెప్పారు. రాజమండ్రిలో 10-15 వేల ఓట్ల తేడాతో టీడీపీ గెలిచేయవచ్చు అని తెలిపారు. అయితే నెల్లూరు కిరణ్ కుమార్ ఓడిపోతారని అంచనా వేశారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఆయన తెలిపారు. విష్ణుకుమార్ రాజు కూడా 99% గెలవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 2 ఎంపీ స్థానాలను విన్ అవుతుందని హార మస్తాన్ తెలిపారు.

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ రికార్డు స్థాయి ఓట్లతో విజయం సాధించనున్నారని పేర్కొన్నారు. పులివెందులలో జగన్ కూడా భారీ విజయం సాధిస్తారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ కూడా ఈసారి గెలుపొందుతారని వెల్లడించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా భారీ కోట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ఆరా సర్వే ప్రకటించడం గమనార్హం. అయితే తమ్మినేని సీతారాం ఓడిపోతారు అని చెప్పి వైసీపీ వారికి షాక్ ఇచ్చారు. వల్లభనేని వంశీ, అచ్చెన్నాయుడు స్వల్ప మెజారిటీతో గెలవబోతున్నారని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది.

మంత్రులైన ఆర్కే రోజా, అప్పలరాజు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి షాక్ ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావు గెలిచే ఛాన్సెస్ 50 అని పేర్కొన్నారు. ఆయన బాగా టఫ్ ఫైటింగ్ ఎదుర్కోవచ్చని చెప్పారు. పిలిస్తే స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలుస్తారని అన్నారు. రాజన్న దొర, బొత్స సత్యనారాయణ గెలవడం ఉండగా గుడివాడ అమర్నాథ్ (గాజువాక), కారుమూరి నాగేశ్వరరావు (తణుకు) ఓడిపోతారట. విశ్వరూప్‌ విజయకేతనం ఎదురు వేస్తారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరాజయం పాలు కానుండగా, దాడిశెట్టి రాజా (తుని) గెలవబోతున్నారు. వనిత కూడా గెలవమన్నారు. జోగి రమేష్, అంబటి, విడదల రజిని, మేరుగ నాగార్జున చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటారు వారు గెలుస్తారా లేదా అనేది సస్పెన్స్. మంత్రి సురేష్ ఓడిపోనున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని సర్వే అంచనా వేసింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలుస్తారు. మొత్తంగా చూసుకుంటే వైసీపీ మంత్రులు ఎక్కువగా ఓడిపోతున్నారు. ఆరా మస్తాన్ సర్వే పరిగణలోకి తీసుకుంటే మంత్రుల ఓటమి వైసీపీ కేంద్రంలో పెద్ద దెబ్బ అవుతుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: