కౌం ( హం ) టింగ్ : 1991లో అక్కడ రక్తపాతం.. దీని నుంచి ఈసీ ఒక్క విషయమైనా నేర్చుకుందా..??
ఓట్ల రిగ్గింగ్, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు స్వైర విహారం చేయడం వల్ల పార్టీ మద్దతుదారులు గొడవలకు తెగబడ్డారు. మోసపోయామని భావించి కౌంటింగ్ డే రోజున ఇష్టం వచ్చినట్లు కొట్లాడుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. బలమైన చట్టాన్ని అమలు చేసేవారు లేకపోవటం వల్ల ఘర్షణలు చెలరేగడం, తీవ్రతరం కావడం చక చకా జరిగిపోయాయి.
ఈ అల్లర్ల నుంచి ఏం నేర్చుకోవాలి ? హింసను అరికట్టడానికి, శాంతిభద్రతలను కాపాడేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద తగినంత భద్రతా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎన్నికల మోసానికి సంబంధించిన ఆరోపణలను వేగంగా, పారదర్శకంగా దర్యాప్తు చేసి పరిష్కరించాలి. ఇందుకు బలమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి.
కొట్లాటలు, చంపుకోవడం వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీలన్నీ శాంతియుతంగా కలిసి మాట్లాడుకునేలా ప్రోత్సహించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గొడవలు జరుగుతాయి అని అనుకుంటే వాటిని వెంటనే కంట్రోల్లోకి తీసుకొచ్చేలాగా బలగాలను మొహరించాలి. గొడవలు లేకుండా పక్కగా ప్లాన్స్ రచించుకోవాలి. ఎన్నికల సంఘం ఇందులో ఏది కూడా పెద్దగా నేర్చుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో మొన్న కూడా భారీ ఎత్తున గొడవలు జరిగాయి. అది కౌంటింగ్ రోజున కాదు కానీ పోలింగ్ రోజున జరిగాయి. రేపే కౌంటింగ్ డే, ఆరోజు కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈసీ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.