కౌం 'ట్రిక్స్': పోలింగ్ ఏజెంటో...కక్కుర్తి పడి పెగ్గేసావో...సీటు చిరగడమే ?

Veldandi Saikiran
భారతదేశవ్యాప్తంగా  పార్లమెంట్ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జూన్ 4వ తేదీన ఇండియా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘ అధికారులు. ఇక ఏపీలో అసెంబ్లీ తో పాటు, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.... కీలక ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల సంఘం.

 
 అభ్యర్థి తరపున ప్రతి కౌంటింగ్ టేబుల్ లో ఒక ఏజెంట్ ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఏజెంట్  మద్యం సేవించి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేసి మరీ ఏజెంట్లను లోపలికి పంపిస్తామని... ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మద్యం తాగి ఏ ఏజెంట్ వచ్చినా... అతని వెంటనే బయటికి పంపిస్తామని హెచ్చరించారు.

 
 అంతేకాకుండా... ఏజెంట్ కచ్చితంగా  సెల్ ఫోన్ లేకుండా రావాలని ఎన్నికల అధికారులు కండిషన్ పెట్టారు. ముఖ్యంగా ఫామ్ 17 సి  ఏజెంట్ చేతిలో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చేటప్పుడు పెన్ను లేదా పెన్సిల్ తెచ్చుకోవాలని సూచించారు. అలాగే వైట్ పేపర్ తెచ్చుకుంటే బెటర్ అని చెబుతున్నారు అధికారులు. కౌంటింగ్ చేసేటప్పుడు లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్ యూస్ అవుతుంది.

 
 ఇక అంతకుమించి ఏ ఒక్క వస్తువు ఎక్కువ తీసుకువచ్చిన... కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అథారిటీ లెటర్స్ కలిగిన జర్నలిస్టులు మీడియా పాయింట్ వద్దకు రావచ్చని తెలిపారు. ముఖ్యంగా ఏజెంట్లు... చాలా యాక్టివ్ గా ఉండి.. ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నోటాకు పడిన ఓటు.. తమ ప్రత్యర్థులకు పడకుండా.. నోటా లోనే ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు ఏదైనా తప్పుడు కార్యక్రమాలకు పాల్పడితే... వెంటనే ఉన్నతాధికారులకు చెప్పాలని సూచించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: