-కొన్ని గంటల్లో కౌంటింగ్ షురూ
-అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగు.
- ఏజెంట్లు ఆదమరిస్తే అభ్యర్థులకు అన్యాయం..!
ఎలక్షన్స్ అంటేనే హడావిడి, భయం, ఆందోళన, అన్నింటినీ వీడి ఉత్కంఠ ఉంటుంది. ఏ ఎలక్షన్స్ లో అయినా ఇద్దరు లేదా ముగ్గురు ప్రత్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడతారు అనేది చెప్పడం కష్టం. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి మొదలు ఎన్నికలు జరిగే వరకు నేతలు చాలా బిజీగా ఉంటారు. ఇవన్నీ ఓకేత్తు అయితే కౌంటింగ్ రోజు మరో ఎత్తు ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ప్రతి అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్ తప్పనిసరిగా ఉంటారు. ఆ వ్యక్తి ముందరే పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో ఓసారి కొన్ని చీఫ్ ట్రిక్స్ పాటిస్తూ ఉంటారు. ఇలా పాటించే కౌంట్రిక్స్ వల్లే ఒక్కోసారి రిజల్ట్ తారుమారవుతుంది. అలా కౌంటింగ్ జరిగే సమయంలో తప్పనిసరిగా అక్కడున్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ అలర్టుగా ఉండాలి. మరి కౌంటింగ్ చేసేటప్పుడు జరిగేటువంటి కౌంట్రిక్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం..
ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎమ్మెల్యే సంబంధించి ఒక హాల్లో ఉంటుంది, ఎంపికి సంబంధించి మరో హాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి అదే హాల్లో పక్కన కొన్ని టేబుల్స్ వేసి కౌంటింగ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఆర్వో ఆఫీసర్ మరియు ఏజెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ మొదలుపెట్టిన అరగంట తర్వాత ఈవీఎం మెషిన్లను లెక్కించడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఒక సూట్ కేసులో కంట్రోల్ యూనిట్ తీసుకొస్తారు. ఈ సమయంలో అక్కడే ఉన్నటువంటి ఏజెంటు ఆ సూట్ కేస్ సీల్ ఎలా ఉందనేది తప్పనిసరిగా గమనించాలి. ఆ తర్వాత అందులో నుంచి కంట్రోల్ యూనిట్ తీసుకొస్తారు. అందులో దానికి కూడా సీల్ వేసి ఉంటుంది. ఆ సీల్ కరెక్ట్ గా ఉందా లేదంటే తీసేసి ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఆ తర్వాత మిషన్ కి పేపర్ సీల్ కూడా ఉంటుంది దానికి కట్ చేసి ఓపెన్ చేస్తారు. ఈ సీల్స్ కరెక్ట్ గా లేకపోతే అక్కడే ఉన్నటువంటి ఎన్నికల అధికారికి తెలియజేయాలి. ఈ సీల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఆ తర్వాత మిషన్ ఆన్ చేస్తారు. ఈ టైంలోనే సూట్ కేసు నుంచి 17సీ ఫామ్ తీస్తారు. ఈ ఫామ్ లో పోలింగ్ బూత్ నెంబర్, కంట్రోల్ యూనిట్ నెంబర్ ఉంటుంది.
ఈ పేపర్ ఏజెంట్స్ కీ కూడా పోలింగ్ జరిగిన రోజే ఇస్తారు. ఆ సూట్ కేసులో పెట్టిన పేపరు మరియు మీ దగ్గర ఉన్న పేపర్ లో ఉన్నటువంటి వివరాలు కరెక్ట్ గా పోయాయా లేదా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా 17సీపై టోటల్ ఓట్స్, కంట్రోల్ యూనిట్ లో బటన్ నొక్కగానే కనిపించే టోటల్ ఓట్స్ ఈక్వల్ గా టాలీ అవ్వాలి. ఒకవేళ ఇందులో తేడా ఉంటే మాత్రం వెంటనే అక్కడున్నటువంటి రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేయాలి. ఒక్కోసారి కౌంటింగ్ ఏజెంట్లు అలర్ట్ గా లేకపోతే నోటాకు పడిన ఓట్లను కూడా ఒక్కోసారి మరో అభ్యర్థికి కలిపేస్తూ ఉంటారు. అలాగే ఇండిపెండెంట్ లకు సంబంధించి ఎవరు ఆ కౌంటింగ్ రోజు అక్కడికి రారు. ఓక్కోసారి ఆ ఓట్లను కూడా కొంతమంది అభ్యర్థులకు కలిపేస్తూ ఉంటారు. ఈ విధంగా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ టైంలో కౌంటింగ్ హాల్లోకి వెళ్లినటువంటి ఏజెంట్లు చాలా అలర్ట్ గా ఉండాలి. ఏమాత్రం ఆదమరిచిన కౌంటింగ్ ప్రక్రియ అనేది తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ హాల్లోకి వెళ్లే ఏజెంట్లు కౌంటింగ్ పూర్తిగా అయిపోయే వరకు అక్కడే వేచి ఉండి అన్ని క్లియర్ అయ్యాకే బయటకు రావాలి. అందులో ఏమాత్రం డౌట్ ఉన్నా అక్కడే ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ కు తప్పనిసరిగా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.