ఏపీ ఎన్నికలపై సమగ్ర వివరాలను చెప్పేసిన సీఈఓ మీనా..!?
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3.3 కోట్ల మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు రాష్ట్రంలోని 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు ముఖేష్ తెలిపారు. ఇకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 26, 473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వినియోగించుకున్నారని., అలాగే మరో 26, 721 మంది సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసినట్లు తెలిపారు.
జూలై 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో సపరేట్ గా ఏర్పాటు చేసిన లోక్సభ ఓట్ల లెక్కింపు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలాలలో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారని ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు ప్రక్రియ మొదలవుతుందని సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 2443 ఈవీఎం టేబుల్ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 33 స్థానాలలో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ నేపథంలో భాగంగా ఎన్నికల కమిషన్ 19 మంది అబ్జర్వర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా 102 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి లేదా రెండు రౌండ్లలో లెక్కిస్తారని., 48 నియోజకవర్గాలలో మూడు రౌండ్లు., మరో 25 నియోజకవర్గాలలో నాలుగు రౌండ్ల లో ఓట్లను లెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఎన్నికల కోడ్ అవలంబిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం 483 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 170 కోట్ల నగదు, 62 కోట్ల విలువైన లిక్కర్, 36 కోట్ల విలువచేసే డ్రగ్స్, 186 కోట్ల విలువచేసే వస్తువులు., అలాగే 29 కోట్లు విలువ చేసే విలువైన గిఫ్ట్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.