RTV రిపోర్ట్: ఏపీలో పెను సంచలనం..ఆ పార్టీకి 23 సీట్లే ?
ఇలా సర్వే సంస్థలు భిన్నమైన ఫలితాలను ఇచ్చి.. ఏపీ ప్రజలను గందరగోళానికి నెట్టివేశాయి. దీంతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు... ఏ సర్వే ను నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ఎన్నికలపై మరో సర్వే తెరపైకి వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై... ప్రముఖ న్యూస్ ఛానల్ ఆర్ టి వి పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్ టి వి పోస్ట్ పోల్ సర్వేలో తెలుగుదేశం కూటమి అఖండ విజయాన్ని నమోదు చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది.
ఈ సర్వే లెక్కల ప్రకారం... తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలకు 150 సీట్లు రాబోతున్నట్లు ఆర్ టి వి వెల్లడించింది. అలాగే వైసిపి పార్టీకి కేవలం 23 స్థానాలు మాత్రమే వస్తాయని... బాంబు పేల్చింది. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతా తెరువదని... తేల్చి చెప్పేసాయి. కానీ ఈ సర్వే లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు గెలుస్తుందని... స్పష్టమైంది. ఈ పోస్ట్ పోల్ సర్వే నేపథ్యంలో... వైసిపి నేతలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
వైసీపీ పార్టీకి కేవలం 23 సీట్లు రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆర్టీటీవీ... ఎన్నికల కంటే ముందు రోజు కూడా... ఇలాగే వైసీపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోతుందని... రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ కూడా ఓడిపోతుందని ఆ సందర్భంగా తెలిపారు. ఇలా తెలంగాణలో గులాబీ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి.. ఆర్ టి వి వ్యతిరేకంగా పనిచేస్తుందని విమర్శలు వస్తున్నాయి.