మనమే గెలుస్తున్నాం తమ్ముళ్లూ... జోష్ నింపిన చంద్రబాబు..??

Suma Kallamadi
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఆయన ఒక క్షణం కూడా వృధా చేయకుండా టీడీపీ శ్రేణులతో మమేకమవుతున్నారు. రేపే ఎన్నికల ఫలితాల తేదీ కాగా  రీసెంట్‌గా ఆయన కేడర్, బూత్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. 
బూత్ క్యాప్చర్ కౌంటింగ్, టీడీపీ+ కూటమి ఏజెంట్లు చేయాల్సిన ముఖ్యమైన పనులేవో సవివరంగా తెలియజేశారు.


అంతేకాదు, "మనమే గెలుస్తున్నాం, తమ్ముళ్లూ" అంటూ కార్యకర్తలలో ఆయన ఫుల్ జోష్ నింపారట. ఎన్నికలలో గెలుస్తామో లేదో అని కార్యకర్తలు కాస్త ఆందోళనలో ఉన్నారని, వారిలో తీర్పు వచ్చేదాకా ఇలాంటి అనవసరపు ఆందోళన లేకుండా చేయడానికి చంద్రబాబు ఆ మాట అన్నట్లు సమాచారం. అలానే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ ట్రెండ్‌లను జాగ్రత్తగా పర్యవేక్షించాలని మరీ మరీ కోరారట. 


2019లో కౌంటింగ్ డే సమయంలో మార్నింగ్ టైమ్‌ వైసీపీ గెలవబోతోందనే ఒక క్లారిటీ అందరికీ వచ్చింది. మొత్తం జగన్‌కే అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో టీడీపీ కౌంటింగ్ బూత్ ఏజెంట్లు బాగా నిరాశ పడిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కౌంటింగ్ పూర్తి కాకముందే స్టేషన్ల నుంచి బయటికి వచ్చేసారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లింది. అయితే బూత్ ఏజెంట్లు ఇలా ఈసారి వెళ్లకూడదని ఆయన కోరుకుంటున్నారు. 


మొదట జగన్ కి అనుకూలంగా ఫలితాలు వచ్చినా సరే చివరి వరకు బూత్‌ ఏజెంట్లు స్టేషన్‌లో ఉండాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారట. "టీడీపీ కూటమిదే ఈసారి విజయం. అందువల్ల ఎవరూ ముందుగానే నిరాశ పడవద్దు." అని చెప్పారట. మొత్తం మీద రేపు ఏపీ ప్రజలకు, పార్టీ నాయకులకు అతి పెద్ద రోజు కాబోతోంది. మళ్లీ జగన్ గెలిస్తే చంద్రబాబు పొలిటికల్ కెరీర్ ముగిసిపోయినట్లే.చూడాలి మరి రేపు ఎవరు గెలవబోతున్నారో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: