జగన్: ఫలితాలకు ముందే మరో అరుదైన రికార్డ్..!
ఇటీవల సీఎం జగన్ ఐదేళ్లు తన పాలనను పూర్తి చేసుకున్నారు. రేపటి రోజున వైసీపీ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ జగన్ సీఎం అవుతారు..లేకపోతే తదుపరి సీఎం జూన్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే వరకు జగన్ సీఎం గా ఉంటారు.. అయితే సీఎం జగన్ జూన్ 11న ప్రమాణ స్వీకారం చేస్తే..1835 రోజులు పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు సీఎం గా పని చేసిన వ్యక్తిగా జగన్ మరో అరుదైన రికార్డును అందుకుంటారు.
ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు సైతం వైరల్ గా చేస్తున్నారు. కచ్చితంగా వైసీపీ పార్టీ వస్తుందని ధీమా అధినేతలలో కార్యకర్తలలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నో సర్వేలు సైతం వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తెలియజేశాయి ముఖ్యంగా ఆరా మస్తాన్ కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో చాలా ధీమాతో ఉన్నారు. అయితే కూటమి కూడా అంతే ధీమాని వ్యక్తం చేస్తున్నది. ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు కలవడంతో కచ్చితంగా ఓటింగ్ ప్రక్రియ తమకే ఎక్కువగా జరిగి ఉంటుందని ప్రెడిక్షన్ ని కూడా తెలియజేస్తున్నారు. మరి రేపటి రోజున ఏం జరుగుతుందో చూడాలి ఎవరు ప్రజలు సీఎంగా ఎంచుకుంటారో మరి. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏవిధంగా ఉంటుందో చూడాలి.