కాంగ్రెస్ : రేసుగుర్రంలా దూసుకెళ్తున్న రాహుల్
అయితే 21 రోజులపాటు ఎదురుచూస్తున్న జనాలు... ఇవాళ ఫలితాలను కూడా ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే... మొదటి రౌండ్ లో రేసుగుర్రంలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. మొదటి రౌండ్ లో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాయి బరేలి, వయనాడులో కూడా రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేశారు.
లోక్‌సభ ట్రెండ్స్‌లో లీడ్‌లో ఎన్డీయే కూటమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఓవరాల్ గా 129 స్థానాల్లో లీడింగ్‌లో ఎన్డీఏ అభ్యర్థులు ఉండటం మనం చూస్తున్నాం. 60 స్థానాల్లో ఇండియా కూటమి, 10 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. ఇక అటు మొదటి రౌండ్ లో రాజ్ నాథ్ సింగ్ కూడా ముందంజ లో ఉన్నారు. ఇక అటు కోయంబత్తూరులో బీజేపీ లీడింగ్ లో ఉంది.
గుజరాత్‌లోని ఆనంద్ సెగ్మెంట్లో కాషాయం ఆధిక్యంలో ఉంది. యూపీ మైన్‌పురిలో అఖిలేష్ భార్య డింపుల్ లీడింగ్ ఉండటం జరగుతోంది. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి..మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ లీడింగ్ లో ఉన్నారు. రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యం ఉండగా... ఢిల్లీలోని ఏడు సీట్లలో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇక ఒక్కో నియోజక వర్గ ఫలితాలు వస్తూనే ఉన్నాయి.