2009 వ సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికలలో భారీ సంఖ్య లో పార్లమెంటు స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చింది . ఇక ఆ తరువాత వీరిపై కాస్త నెగెటివిటీ జనాలలో ఏర్పడడం మొదలు అయింది. ఇక ఆ తర్వాత 2014 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వీరికి చాలా గట్టి దెబ్బ తగిలింది. ఆ ఎన్నికలలో వీరికి కేవలం 44 ఎంపీ స్థానాలు మాత్రమే దేశ వ్యాప్తంగా లభించాయి.
ఇక 2014 వ సంవత్సరం బిజెపి ఏకంగా 282 స్థానాలను గెలిచి దేశంలో అధికారంలోకి వచ్చింది. ఇక 2014 వ సంవత్సరం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇక వీరి ఐదు సంవత్సరాల పరిపాలనాలతో జనాలలో పెద్దగా అసంతృప్తి ఏమీ నెలకొనలేదు. దానితో 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కి 2014 తో పోలిస్తే ఎక్కువ సీట్లు వచ్చాయి. 2019 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కి ఏకంగా సొంతంగా 303 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 2019 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు మాత్రమే వచ్చాయి.
ఇకపోతే 2024 వ సంవత్సరానికి కూడా బిజెపి పై ప్రజలలో పెద్దగా వ్యతిరేకత ఏమీ రాలేదు. దానితో ఈ సారి 2014 , 2019 సంవత్సరాల కంటే ఎక్కువ స్థానాలు బిజెపి.కి వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ కూడా అవే నివేదికలను విడుదల చేశాయి. ఇకపోతే కాంగ్రెస్ 2014 వ సంవత్సరం తో పోలిస్తే 2019 సంవత్సరం కాస్త ఎక్కువ స్థానాలను దక్కించుకుంది. మరి ఈ సారి మరిన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకుంటుందేమో చూడాలి.