ఫ‌స్ట్ రౌండ్ : చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు భారీ మెజార్టీలు

RAMAKRISHNA S.S.
హమ్మయ్య గత 7, 8 నెలలుగా ప్రతిరోజు, ప్రతిక్షణం ఎంతో ఉత్కంఠ అనుభవించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఈరోజు ఆ ఉత్కంఠ‌ తీరిపోనుంది. ఉదయం ఎనిమిది గంటలు అయిందో లేదో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల‌ లెక్కింపు ప్రారంభమైంది. పోస్ట‌ల్ బ్యాలెట్ ట్రెండ్స్ అలా ముగుస్తున్నాయో లేదో వెంట‌నే ఈవీఎంల బాక్సులు ఓపెన్ అవ్వ‌డం స్టార్ట్ అయ్యాయి. 8:30 నిమిషాలకు ఈవీఎంల బాక్సులు సీల్ ఓపెన్ అయ్యాయి. రౌండ్ల వారి ఫలితం వచ్చేయనుంది. తొలి రౌండ్ల ట్రెండ్స్ ప్రారంభమయ్యాయి.

పోస్ట‌ల్ బ్యాలెట్ల ట్రెండ్ అలా ప్రారంభ‌మైందో లేదో వెంట‌నే కూట‌మి కి అనుకూలంగా ఎక్కువుగా ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు అలా స్టార్ట్ అయ్యాయో లేదో కూట‌మి అభ్య‌ర్థులు ప‌లు చోట్ల దూసుకు పోతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో 2 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీలో ఉన్నారు. అటు పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 1000 + ఓట్ల ఆధిక్యంలో ఉన్న‌ట్టు ట్రెండ్స్ చెపుతున్నాయి. తొలిరౌండ్‌లో గొల్ల‌ప్రోలు మండ‌లం గొల్ల‌ప్రోలు, దుర్గాడ‌, పెందుర్తి ఓట్ల కౌంటింగ్ జ‌రిగింది.

ఇక రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఏకంగా 3 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు లోనూ టీడీపీ ఆధిక్యం క‌న‌ప‌రుస్తోంది. అదే గోదావ‌రి జిల్లాలోని మండ‌పేట నుంచి టీడీపీ అభ్య‌ర్థి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆధిక్యంలో ఉన్నారు. ఇక తిరుప‌తి ఎంపీ, చంద్ర‌గిరి అసెంబ్లీలో వైసీపీ ఆధిక్యం క‌న‌ప‌రుస్తోంది. రాజ‌మండ్రి ఎంపీ నుంచి పురందేశ్వ‌రి 2 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఏపీ అసెంబ్లీ , పార్ల‌మెంట్ , తెలంగాణ పార్ల‌మెంట్ , ఇండియా పార్ల‌మెంట్ . . .  ఎన్నిక‌ల కౌంటింగ్ , లైవ్ అప్‌డేట్స్ , విశ్లేష‌ణాత్మ‌క , స‌మ‌గ్ర‌ క‌థ‌నాలు ఎప్ప‌టిక‌ప్పుడు అందించేందుకు indiaherald.com ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: