పోస్టల్ బ్యాలెట్ : మోదీ నా మజాకా ? పదేళ్ల తరువాత కూడా ఉద్యోగులంతా మోదీ వైపే ?

Veldandi Saikiran
భారతదేశ వ్యాప్తంగా అందరూ లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఎవరు గెలుపు మీద వారు చాలా ధీమంగా ఉండటం విశేషం. ముఖ్యంగా... దేశ ప్రధాని నరేంద్ర మోడీ... తాను పోటీ చేసిన వారణాసిలో దూసుకు వెళ్తున్నారు.


 ఇప్పటికే వారణాసి నియోజకవర్గ తరఫున రెండుసార్లు   ఎంపీగా గెలిచారు నరేంద్ర మోడీ. ఇక ఈసారి కూడా  గెలిచి హైట్రిక్ కొట్టాలని ఆయన భావించారు. దీనికి తగ్గట్టుగానే కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి... ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు అధికారులు.


 ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకు వెళ్తున్నారు. ఎక్కడ తగ్గేది లేదు అంటూ ముందుకు వెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్  ఓట్ల లెక్కింపులో తన ప్రత్యర్థి అజయ్ రాయి ను దాటుకొని నరేంద్ర మోడీ దూసుకు వెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో  అందరూ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉంటారు.. అయితే ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు.

 
 ఇది భారతదేశ రాజకీయాలలో  పరిపాటి గానే వస్తుంది. కానీ వారణాసి నియోజకవర్గంలో... ప్రధాని నరేంద్ర మోడీకి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఎక్కడ కూడా... ప్రభుత్వ ఉద్యోగుల కు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల వ్యతిరేకత లేదు. ఇక మూడవ సారి కూడా... ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేసి... ఆయనను లీడింగ్ లోకి తీసుకువచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు. పోస్టల్ బ్యాలెట్ లో విజయం సాధించిన నరేంద్ర మోడీ...  వారణాసిలో బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తారని అందరూ భావిస్తున్నారు. 
ఇది ఇలా ఉండగా భారతదేశ వ్యాప్తంగా.. ఎన్డీఏ కూటమి దూసుకు వెళ్తోంది. ఇప్పటికే 250 సీట్లు పైన ఆధిక్యంలో ఉండి బిజెపి. అటు వందకు పైగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఉండటం మనం చూస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: