కడప: కడపలో పాగా వేసిన టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి.. వైసిపి ఫ్యాన్ విరగొట్టేసింది..!!

Suma Kallamadi

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. అయితే ఈసారి టిడిపి పూర్తి ఆధిపత్యాన్ని కనపరుస్తోంది ఎక్కడ చూసినా టిడిపి అభ్యర్థులే ముందంజలో ఉంటున్నారు. ఇక రాయలసీమలోని అత్యంత కీలకమైన కడపఅసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి వెనుక పడ్డారు.
ఈసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి షేక్ అంజాద్ బాషా, టీడీపీ నుంచి మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంపై సీఎం జగన్ ఎప్పుడూ ఫోకస్ చేస్తుంటారు కానీ ఈసారి మాత్రం కడప ఆయన చేయి జారిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎంత చేసినా చివరికి టిడిపిని ప్రజలు గెలిపిస్తున్నారని తెలుస్తోంది.
ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 274,312 కాగా పురుషులు133,967 ఓట్లు, మహిళలు140,257 ఓట్లు ఉన్నాయి. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో అంజాద్ బాషా టిడిపి అభ్యర్థులపై గెలిచి చూపించారు. మాధవి రెడ్డి చాలా ఆదిక్యంతో ఈసారి గెలిచేలాగానే కనిపిస్తున్నారు.
అయితే కడపలోనే కాదు మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ లీడ్ లో కనిపిస్తున్నారు. పులివెందులలో తొలి రౌండు ముంచేసరికి వైఎస్ జగన్‌కి ఒకటి ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కూడా వెనకనపడ్డారు.
లోక్‌సభ ఫలితాల విషయాలకి వస్తే టీడీపీ 11 స్థానాల్లో ముందంజలో ఉండగా వైసిపి రెండు స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. బీజేపీ నాలుగు స్థానాల్లో లీడింగ్ లోకి వచ్చింది. కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఒక్క స్థానంలో కూడా వైసిపి ఆదిత్యంలో లేకపోవడం గమనార్హం. వైసీపీ 4 ఎంపీ స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తుండగా.. టీడీపీ 16 పార్లమెంటు స్థానంలో ఆధిక్యంలో ఉంది. వైసీపీ 11 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉండగా టిడిపి 39 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కొన్ని మీడియా వర్గాల ప్రకారం టిడిపి కూటమి ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: