బద్వేలులో వైసీపీ హవా.. మరోసారి భారీ విజయం దిశగా సుధ..??

frame బద్వేలులో వైసీపీ హవా.. మరోసారి భారీ విజయం దిశగా సుధ..??

Suma Kallamadi

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వేగంగా విడుదలవుతున్నాయి. ఏపీ అంతటా టిడిపి హవా కొనసాగుతోంది. ఈసారి బద్వేలు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ దూసుకుపోతోంది. ఈసారి ఇక్కడి నుంచివైసీపీ నాయకురాలు డాక్టర్‌ దాసరి సుధ, టీడీపీ కూటమి నేత బొజ్జా రోశన్న (బీజేపీ) పోటీ చేశారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 218,740. అట్లూరు, కలసపాడు, గోపవరం, పోరుమామిళ్ల, బద్వేలు, బి.కోడూరు, శ్రీఅవధూత కాశినాయన మండలాలు ఈ పరిధిలోకి వస్తాయి.

2024 అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్

వైసీపీ పార్టీ సభ్యురాలు సుధ 20 రౌండ్లలో మూడు రౌండ్లు ముగిసేసరికి 13,786 ఓట్లు సాధించారు. 4,311 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బొజ్జ రోశన్న 9475 ఓట్లతో సెకండ్ స్థానంలో ఉన్నారు.

వైసీపీ పార్టీ సభ్యురాలు సుధ అనుకోకుండా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఆమె భర్త గుంతోటి వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో 2021లో మరణించడంతో 2021లో బద్వేల్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. బద్వేలు ప్రజలు ఆమెను 90,950 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈసారి కూడా ఆమె విజయం ఖాయం లాగా కనిపిస్తోంది.

మరోవైపు బొజ్జా రోశన్న దివంగత మాజీ మంత్రి వీరారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయన నంద్యాల జిల్లాలో సాగునీటిపారుదలశాఖ డీఈఈగా పనిచేశారు. రాజకీయాల కోసం ఆ ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఆపై బీజేపీ పార్టీలో జాయిన్ అయి యాక్టివ్‌గా పని చేస్తున్నారు. బొజ్జా రోశన్న పోరుమామిళ్ల మండలానికి చెందినవారు, అంటే ఆయన లోకల్. రోశన్నపై క్రిమినల్ కేసులు ఒక్కటి కూడా లేకపోవడం విశేషం.

ఎమ్మెల్యే దాసరి సుధ వృత్తి రీత్యా గైనకాలజీ. ఆమె భర్త ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సైతం వైద్య వృత్తిలో కొనసాగారు. ఈ దంపతులు కడపలోని ఓ పాపులర్ హాస్పిటల్ లో డాక్టర్లు గా పనిచేశారు. ఈసారి సుధ గెలిస్తే హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: