ఏపీ ఎన్నికలు... వైసీపీకి చిమ్మ చీకట్లు... వామ్మో ఈ షాకులు చూడండి...
కూటమి విజయం .. హైలెట్స్ ఇలా ఉన్నాయి..
- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ ... కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ కకావికలమైపోయింది.
- దాదాపు 145 కు పైగా నియోజకవర్గాల్లలో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి అభ్యర్థులు
- కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్ పార్టీ నేతలు
- ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి
- జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తున్న కూటమి
- ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్న కూటమి
- రాయలసీమలోనూ కూటమి జోరు
- కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా
- రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి జోరు
- అసలు కొన్ని సంవత్సరాలుగా పార్టీ గెలవని నియోజకవర్గాల్లోనూ టీడీపీ దూకుడు... 20 - 25 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగరని నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు దూసుకు పోతున్నారు.
- ఉమ్మడి గోదావరిలోనూ దూసుకుపోతున్న కూటమి
- దక్షిణ కోస్తాలోనూ పరుగులెడుతున్న సైకిల్
- ఒకరిద్దరు మినహా ఓటమి బాటలో మంత్రులు
- సీఎం సొంత జిల్లాలోనూ గట్టి పోటీ ఇస్తున్న కూటమి
- పలు నియోజకవర్గాల లో కూటమి అభ్యర్థులు అయితే ఏకంగా వేల ల్లోనే భారీ మెజార్టీలు సాధిస్తూ దూసుకు పోతున్నారు.
- ఇక మంత్రులు అందరూ కూడా ఓటమి బాటలో ఉన్నారు. పెద్ది రెడ్డి అయితే ఒక రౌండ్‌కు వెనకపడుతూ.. ఒక రౌండ్‌కు ముందంజలో ఉంటూ వెళుతున్నారు.
- రోజా అయితే 10 వేల ఓట్లు వెనకపడిపోయింది... అంబటి రాంబాబు కూడా వెనకపడిపోయారు.