పాదయాత్ర చేస్తే గెలుపు పక్కా.. నిరూపించిన లోకేష్...!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఈ రోజున విడుదలయ్యాయి.. ఈ ఎన్నికల ఫలితాలలో టిడిపి పార్టీ ఘన విజయాన్ని అందుకునేలా కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఏపీలో గత కొన్నేళ్ల నుంచి ఒక సెంటిమెంట్ అయితే ఉన్నది.అదేమిటంటే ఎవరైతే పాదయాత్ర చేస్తారో వారు ఖచ్చితంగా అధికారం చేపడతారని సెంటిమెంట్ కలిగి ఉన్నది.. ఇప్పటికే చాలామంది ఈ సెంటిమెంట్ తోనే విజయాన్ని అందుకున్నారు. గతంలో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్రను చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా గెలిచారు.



ఆ తర్వాత 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి కావడానికి ముఖ్య కారణం కూడా ఆయన పాదయాత్ర అని చెప్పవచ్చు.. ఈసారి 2024 ఎన్నికలలో నారా లోకేష్ గతంలో చేపట్టిన పాదయాత్ర వల్లే ఈసారి టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిందని పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు. దీంతో అటు టిడిపి నేతలు సంబరాలు అంబరాన్ని అంటిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో సంస్థలు సర్వేలు సైతం అటు కూటమికి వైసిపి పార్టీకి రెండు అధికారం చేపడతాయనే విధంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఫలితాలు చూస్తే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నాయి.


ఏది ఏమైనా టిడిపి పార్టీ మరొక సారి అధికారంలోకి రాబోతుందని చెప్పవచ్చు. అయితే సీట్లు ఎన్ని అనే విషయం పైన ఇంకా క్లారిటీగా రాలేదు. వైసిపి పార్టీకి ఇది ఊహించని దెబ్బ అని కూడా చెప్పవచ్చు.మరి ఈ విషయాల పైన వైసిపి నేతలు అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఓటింగ్ ప్రక్రియ మొదటి నుంచి ఉద్యోగస్తులు కూడా వైసిపి పార్టీకి వ్యతిరేకంగానే ఓటు వేసినట్టుగా కనిపిస్తోంది.. చాలామంది నేతలు కౌంటింగ్ పూర్తి అవ్వకముందే ఇంటి బాట పడ్డారు. అయితే టిడిపి పార్టీకి కేకే సర్వే కరెక్ట్ గా సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఈసారి టిడిపి పార్టీ అధికారంలోకి రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: