చాలా విడుదలుగా భారతదేశమంతటా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇక వీటన్నింటికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. ఇక ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడ్డాయి.
ఇక దేశమంతా కూడా ఈ సారి మోడీ అధ్యక్షతన బి జె పి ప్రభుత్వం భారీ పార్లమెంటు స్థానాలను దక్కించుకొని మరోసారి అధికారంలోకి రాబోతుంది అని చాలా మంది ప్రజలతోపాటు , రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా భారతీయ జనతా పార్టీ కి 380 పైగా పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని , 400 సీట్లు వచ్చినా పెద్దగా అంచనా ఆశ్చర్యం లేదు అని అంచనాలు వేశాయి. దానితో ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్ చాలా స్పీడ్ గా గ్రో అయ్యింది. కానీ జనాల అంచనాలు , ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని తలకిందులు అయ్యేలా బి జె పి కి అనుకున్నంత స్థాయిలో సీట్లు వచ్చే పరిస్థితులు కనబడడం లేదు.
ప్రస్తుతం బి జె పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిపోర్ట్ స్థాయిలో లీడ్ లో కనబడడం లేదు. అధికారంలోకి వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తే పరిణామాలు ప్రస్తుతం ఉన్నాయి. దానితో ఈ రోజు స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం ఏర్పడుతుంది. దానితో ఈ రోజు సెన్సెక్స్ , నిఫ్టీ అమాంతం పడిపోయాయి. ఈ రోజు సెన్సెక్స్ 3500 పాయింట్లు నష్టంలోకి వెళ్ళగా , నిఫ్టీ 110 పాయింట్లు నష్టం లోకి వెళ్ళింది. ఇలా ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున స్టాక్ మార్కెట్ లో ఈ రోజు అల్లకల్లోలం ఏర్పడుతుంది.