పాలకొల్లు : రామానాయుడా రాసిపెట్టుకో నీకు కేబినెట్ బెర్త్ పక్కా...!
అందుకే ఈ ఎన్నికలలో రామానాయుడు ను ఎలాగైనా ఓడించాలని జగన్ తో పాటు మిథున్ రెడ్డి కీలకంగా పని చేశారు. పైగా బీసీ అస్త్రం వాడిన వైసీపీ అధిష్టానం.. ప్రముఖ వ్యాపారవేత్త గుడాల శ్రీహరి గోపాలరావు ( గోపి ) కి టికెట్ ఇచ్చింది. నియోజకవర్గంలో కాపుల తర్వాత బలంగా ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గ ఓటర్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్ల సహకారంతో పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలి అన్నదే వైసీపీ స్కెచ్ గా కనిపించింది. అయితే రామానాయుడు లాంటి బలమైన నేత ముందు వైసీపీ అధినేత జగన్ ఎత్తులు పెద్దగా ఫలించినట్టు ప్రచారంలో కనిపించలేదు.
ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారం.. పోలింగ్ సరళి.. పోల్ మేనేజ్మెంట్‌లో రామానాయుడు మరోసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినట్టు స్పష్టంగా కనిపించింది. పైగా గత ఎన్నికలలో ఇక్కడ జనసేనకు ఏకంగా 30 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. ఈసారి జనసేన కాపు సామాజిక వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గాలు కూడా రామానాయుడు కు జై కొట్టినట్లు పోలింగ్లోనే క్లియర్గా తెలిసిపోయింది. నియోజకవర్గంలో పాలకొల్లు మున్సిపాలిటీ తో పాటు.. పాలకొల్లు, యలమంచిలి మండలాలు ఉన్నాయి.
ఇక ఈ రోజు కౌంటింగ్‌లో రామానాయుడుకు ఏకంగా 65 వేల మెజార్టీ వచ్చింది. పూర్తి కౌంటింగ్ అయ్యే సరికి ఈ మెజార్టీ మరింత భారీగా పెరిగిపోనుంది. అసలు ఈ రేంజ్ మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. ఈ క్రమంలోనే నిమ్మల హ్యాట్రిక్ కొట్టేశారు. ఓటమి అన్నది లేకుండా గత మూడు ఎన్నికల్లోనూ గెలిచిన నిమ్మల మంత్రి అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇది నిమ్మల రేంజ్‌ను మరింత పెంచే విజయం అని చెప్పాలి.