ఏపీ : ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
పోయిన నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో భాగంగా తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగగా , వై సి పి పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగింది. ఇక పోయిన నెల మే 13 వ తేదీన జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది.

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. అలాగే దాదాపు కొన్ని స్థానాలలో మినహాయిస్తే చాలా స్థానాలలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే విషయం కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కూటమి కి భారీ మొత్తంలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టి డి పి ఈ సారి భారీ శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. టి డి పి ఇప్పటికే 45 శాతం ఓటే షేర్ ను దక్కించుకోగా , వై సీ పీ కి 39.43 ఓట్ శాతం లభించింది. ఇక జనసేన పార్టీకి 8.63 శాతం ఓట్లు వచ్చాయి. ఇక టి డి పి పార్టీ 132 , జనసేన 20 , వై సీ పీ 16 ,  బి జె పి 7 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో కూటమికే భారీ స్థానాలు వచ్చే అవకాశం ఉండడంతో చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: