ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మే 13 వ తేదీన ఎన్నో నెలల హోరా హోరీ ప్రచారాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికల అనంతరం మేము గెలుస్తాము , మేము అధికారంలోకి వస్తాము అని ఎవరికి వారు చెబుతూ వస్తున్నారు. ఇకపోతే మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి.
ఉదయం 6 గంటల నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక చోట్ల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. అందులో భాగంగా తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఆలజంగి జోగారావు బరిలో ఉండగా , టిడిపి పార్టీ అభ్యర్థిగా బోనెల్ విజయ్ చంద్ర బరిలో ఉన్నారు. ఇకపోతే 2019 వ సంవత్సరం వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అలజంగి జోగారావు ఈ ప్రాంతం నుండి మొదటి సారి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు.
ఇక ప్రస్తుతం ఈయన ఈ ప్రాంతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ ప్రాంతంలో ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగడం , ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈయనకు ఈ ప్రాంతంలో మంచి క్రేజ్ ఉంది. ఇకపోతే విజయ్ చంద్ర కు కూడా ఈ ప్రాంతంలో మంచి గ్రిప్ ఉంది. దానితో వీరిద్దరి మధ్య మంచి పోటీ ఉండేఅవకాశాలు ఉన్నాయి అని ఇక్కడి ప్రాంత ప్రజలు మొదటి నుండే భావిస్తున్నారు. కాకపోతే వీరి మధ్య పెద్దగా పోటీ ఏమీ జరగలేదు. ఇక్కడ టిడిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయ్ చంద్ర , వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి జోగారావు పై 23650 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహనరావు మూడో స్థానానికి పరిమితం అయ్యారు.