డోన్: హ్యాట్రిక్ మిస్ చేసుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..??

Suma Kallamadi
నంద్యాల జిల్లాలో అత్యంత టఫ్ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో డోన్ అసెంబ్లీ ప్రాంతం ఒకటి. ఈసారి ఇక్కడ నుంచి కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గన 2014, 2019 ఎన్నికల్లో బ్యాక్-టు-బ్యాక్ విన్ అయి తన సత్తా చాటారు. బుగ్గన ఫ్యామిలీ స్వాతంత్ర్యానికి ముందు నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచర్లలో సర్పంచ్‌ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 224,581. ఇక్కడ గెలుపోటములు బీసీ ఓటర్ల పైన ఆధారపడి ఉంటాయి. బేతంచర్ల, డోన్, ప్యాపిలి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
* 2024 ఎన్నికల రిజల్ట్  
మొత్తం 21 రౌండ్లలో 19 రౌండ్లు ముగిసే సరికి టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి 83,410 ఓట్లు సాధించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 79,310 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. సూర్య ప్రకాష్ రెడ్డి 4,100 కోట్ల మెజారిటీతో దాదాపు గెలుపు సాధించేశారు.
బుగ్గన 2024లో కూడా గెలిచినట్లయితే హ్యాట్రిక్ సాధించి ఉండేవారు. ఈసారి వైసీపీ ఓటు బ్యాంక్ కోల్పోయింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను కూడా చక్కగా పరిష్కరించగలిగారు.
ఆయన ప్రత్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ప్రజల్లో బాగానే ఆదరణ కలిగి ఉన్నారు. ఈయన తండ్రి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి. 1991 లో కాంగ్రెస్ టికెట్ పై కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004 2009 ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ టీడీపీ నాయకుడితో పాటు ఆయన కుటుంబం అనేక ఏళ్లుగా స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: