మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు గాను జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు కాగా మధ్యాహ్నం నుండే చిన్న చిన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు విడుదల అవుతూ వస్తున్నాయి. ఇకపోతే తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన కురూపం నియోజకవర్గం ఫలితం విడుదల అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ఇకపోతే ఈ ప్రాంతం నుండి పాముల పుష్ప శ్రీవాణి వైసిపి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండగా , కూటమి అభ్యర్థిగా తోయాక జగదీశ్వరి బరిలో ఉంది. ఇకపోతే పాముల పుష్ప శ్రీవాణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో అనగా 2014 సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందింది. ఇక 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో కూడా ఈమె వైసిపి పార్టీ నుండి ఈ ప్రాంత సీటు దక్కించుకొని రెండవ సారి కూడా ఈ ప్రాంతంలో గెలుపొందింది. ఇలా రెండు సార్లు వరుసగా ఈ ప్రాంతం నుండి ఈమె గెలుపొందింది.
ఇకపోతే ఈమెకు 2019 జూన్ 8 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇలా ఇప్పటికే ఈమె రెండు సార్లు ఈ ప్రాంతం నుండి వరుసగా గెలుపొంది ఉండడం , అలాగే ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో ఈమెకు ఈ ప్రాంతంలో చాలా మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ప్రాంతం నుండి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన జగదీశ్వరి కి కూడా ఈ ప్రాంతం పై మంచి పట్టు ఉంది. దానితో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని జనాలు మొదటి నుండి అనుకున్నారు. కాకపోతే మొదటి నుండి ఇక్కడ టిడిపి పార్టీ జోష్ ను చూపించింది. దానితో చివరగా వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి పాముల పుష్ప శ్రీవాణి పై , టిడిపి అభ్యర్థి అయినటువంటి తోయాక జగదీశ్వరి విజయం సాధించింది.