రిజల్ట్ చూసి జగన్‌కు మైండ్ బ్లాంక్...??

Suma Kallamadi
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్ వెళ్ళేటప్పుడు 150 పైగా సీట్లు తమకు వస్తాయని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే జగన్ అంచనా వేసిన దాంట్లో నిజం 20% శాతం అసెంబ్లీ సీట్లను కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. ఈసారి ఏపీ అంతటా వైసీపీ ఓటు బ్యాంకు బాగా దెబ్బతిన్నది. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 40 నుంచి 41 స్థానాలు టీడీపీకే వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ ఒక్కటే 46 శాతానికి పైగా ఓటు షేర్ పొందింది. జనసేన దాదాపు 9 శాతం ఓటు షేర్ పొందింది. బీజేపీ 3 శాతం దాకా ఓటు షేర్ సంపాదించింది. అంటే టోటల్ గా 58% దాక టీడీపీ కూటమి ఓట్లను సాధించింది.
ఇక మిగతా శాతం ఓట్లలో కాంగ్రెస్, ఇతర పార్టీ ఓట్ల శాతం పోను వైసీపీ కేవలం 35 నుంచి 37% ఓట్ల షేర్ తో సరిపెట్టుకుంది. దీనిని ఘోర పరాజయంగా పరిణించుకోవచ్చు. సీట్ల పరంగా చూసుకుంటే, వైసీపీ కనీసం 20 సీట్లు కూడా గెలుచుకోలేకపోవడం జగన్ కు ఒక మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం అని చెప్పుకోవచ్చు. జగన్ పరిపాలనపై వ్యతిరేకం వల్లే ఈ రేంజ్ లో వైసీపీ పతనమయింది ఇక చంద్రబాబు తన చరిత్రలో గెలవనన్ని సీట్లు ఈసారి గెలిచారు. ఎన్నడూ పొందని విధంగా ఎక్కువ ఓట్ షేరు సాధించారు.
ఇకపోతే టీడీపీ కూటమి 134 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. వైసీపీ పుంజుకోలేని విధంగా వెనుకంజకు వెళ్లిపోయింది. దానికి కేవలం 13 సీట్లలోనే ముందంజలో ఉంది. ఇంకా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. జనాలకు కోపం తెప్పించేలా  మద్యం పాలసీ తీసుకురావడం, అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, అతిగా పంచుడు కార్యక్రమాలు, ఎడాపెడా అభ్యర్థులను మార్చేయడం, రాజధాని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, ఇసుక దందా, ప్రతిపక్షాల ఐక్యత ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్లు జగన్ ఈసారి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: