ఏపీ : నిజమైన కేకే సర్వే..కూటమి సునామి ఎవ్వరు ఊహించలేదుగా..

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అక్కడక్కడ జరిగిన కొన్ని ఘటనల మినహా సజావుగా సాగాయి. ఫలితాలు కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిది అనే దానిపై తాజాగా పదుల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే ఇందులో ఎవరూ కూటమి సునామీని అస్సలు ఊహించలేదు.కానీ కేకే సర్వే మాత్రం కూటమి భారీ విజయాన్ని నూటికి నూరు శాతం అంచనా వేసింది. ఎవరూ కూడా ఊహించలేని స్ధాయిలో కూటమి ఏకంగా 160 సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసింది. పలు జాతీయ, లోకల్ సర్వేలకు భిన్నంగా కేకే సర్వే వేసిన మొదట్లో ఎవరూ కూడా నమ్మలేదు. కానీ ఫలితాలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడినన్ని ఎగ్జిట్ పోల్స్ గతంలో ఎప్పుడూ కూడా లేవు.

 గత ఎన్నికల్లో ప్రజల నాడిని ఊహించిన వారిలో సీపీఎస్, వీడీపీ వంటి సంస్థలు ముందు ఉండేవి అయితే ఈ సారి అవి అదే సమయంలో గతంలో కచ్చితమైన ఫలితాలు ఇచ్చిన ఆరా మస్తాన్ వంటి వారు కూడా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.. ఇలాంటి పరిస్ధితుల్లో కూడా కేకే సర్వే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సంచలనంగా మారింది.ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని కేకే సర్వే అద్భుతంగా అంచనా వేసింది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 14 సీట్లకు పరిమితం అవుతుందని కేకే సర్వే అంచనా వేసింది. అలాగే టీడీపీ స్వయంగా పోటీచేసిన 144 సీట్లలో 133 సీట్లు అలాగే జనసేన పోటీ చేసిన 21 సీట్లకు గాను 21 సీట్లు, బీజేపీ పోటీ చేసిన 10 సీట్లకు గాను 7 సీట్లు సాధిస్తుందని కేకే సర్వే వెల్లడించింది. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు చూసి వైసీపీ పార్టీ నివ్వెరపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: