మడకశిర: కేవలం 25 ఓట్లతో గెలిచిన ఎమ్మెస్ రాజు..!

Divya
శ్రీ సత్య సాయి జిల్లా.. హిందూపురం సెగ్మెంట్లో ప్రధమంగా వినిపించే నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎం.తిప్పేస్వామి 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగి 13, 136 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీకి చెందిన కే.ఈరన్న పై విజయం సాధించారు. అయితే ఈసారి వైఎస్ఆర్సిపి తరఫున ఈరలక్కప్ప బరిలోకి దిగగా టిడిపి కూటమి తరపున ఎమ్మెస్ రాజు పోటీకి దిగారు.. వీరిద్దరి పోరులో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మడకశిర నియోజకవర్గంలో జోరుగా సాగింది.  ముఖ్యంగా ఇక్కడ చాలా వరకు టిడిపి అభ్యర్థి ఎమ్మెస్ రాజు వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడికి స్థానికంగా బలాలు చూసుకున్నట్లయితే ఈర లక్కప్ప కంటే ఎమ్మెస్ రాజు కి అనుకూలంగా ప్రజలు ఉన్నట్లు వార్తలు వినిపించినా..  ఇక్కడ చంద్రబాబు క్యాండెట్ ని మార్చడంతో అసమతి ఛాయలు అలుముకున్నాయి..

ముఖ్యంగా ఇక్కడ సునీల్ కుమార్ కి టికెట్ ఇస్తామని కూటమి అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ సునీల్ కి బదులు ఎంఎస్ రాజుకి టికెట్ ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళనలు మొదలయ్యాయి.. ముఖ్యంగా క్యాడర్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మడకశిర టిడిపి కార్యాలయాన్ని ముట్టడించారు.. టిడిపి జెండాలను చింపి పోస్టర్లను చెప్పులతో కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు..  చంద్రబాబుకు నీతి లేదు అంటూ ధర్నాలు కూడా చేశారు. ఇక అలా ఒకరకంగా ఎంఎస్ రాజుకి ఇక్కడ టిడిపి క్యాడర్ నుంచి వ్యతిరేకత ఏర్పడింది.. అప్పటివరకు టికెట్టు ఆశించిన సునీల్ పూర్తిస్థాయిలో టికెట్ లభించకపోవడంతో భంగపడ్డారు. ఇక అలా ఒకవైపు క్యాడర్ వల్ల ఎమ్మెస్ రాజుకు వ్యతిరేకత ఏర్పడడంతో మరొకవైపు ఈర లక్కప్పకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అటు ప్రజలలో ఇటు కేడర్ అభ్యర్థులలో అసమ్మతి నెలకొన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ మొదలైంది..

 ఇక తాజాగా విడుదలైన ఫలితాలను బట్టి చూస్తే... కేవలం 25 ఓట్లతోనే ఈరలక్కప్పా ఎమ్మెస్ రాజు గెలుపొందారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: