పాపం జగన్ ను ఓడించింది ఆ వైసిపి నేతలేనా..?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఇంత చిత్తుచిత్తుగా ఓడుతుందని జగన్ అస్సలు ఊహించలేదు. ఈ ఓటమి అనేది పూర్తిస్థాయిగా ప్రజల నుంచి వ్యతిరేకత వల్లే వచ్చిందని చెప్పవచ్చు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి మొదలు వైసిపి నాయకులు ఎక్కడా కూడా లీడింగ్ కనబడలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి దక్కేలా కనిపించడం లేదు. అంటే ఈ విధమైన ఓటమికి కారణం వైసిపి చేసిన తప్పులేనా, జగన్ చేశాడా, లేదంటే ఎమ్మెల్యేలు చేశారా? అనేది జగన్ కు ఇంకా అంతు పట్టడం లేదు.  ఇది పక్కా వైసిపి నాయకుడు చేసిన తప్పు కాదు. ఆయన ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు.  వాటిని అమలు చేయడం కోసం వాలంటీర్లను కూడా నియమించారు. ఆ పథకాలు కేవలం వైసీపీకి చెందిన కొంతమంది బడా నాయకులకు ఇండ్లలోకి మాత్రమే వెళ్లాయని పేద ప్రజలకు అందలేదని, దీంతో చాలావరకు వ్యతిరేకత వచ్చింది. 

అంతేకాకుండా లోకల్ లో ఉండేటువంటి చోటామోటా లీడర్లు కిందిస్థాయి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టారని, వైసిపికి ఓటు వేయలేకపోతే మీ అంతు చూస్తాము అనే విధంగా వారు ప్రజలతో ప్రవర్తించారని తెలుస్తోంది.  ప్రజలు కూడా వైసీపీకీ సపోర్ట్ చేస్తున్నట్టే చేసి ఓటు వేయడంలో మాత్రం పక్కా స్టాటజీ ఉపయోగించారు. బూతు లోపలికి వెళ్లే వరకు మీకే వేస్తాం అంటూ చెప్పారు,  కానీ లోపలికి వెళ్ళాక వారి చేయి కూటమి అభ్యర్థుల  వైపు వెళ్ళింది. అలా సైలెంట్ గా ఓట్లు వేసి   మళ్లీ బయటకు వచ్చి వైసీపీకే ఓటు వేశాం అని కూడా చెప్పారు.  ఇలా జనాలు భయపడడానికి ప్రధాన కారకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చోటా మోట లీడర్లే అని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

వాళ్లే గనక జగన్ ఇచ్చే పథకాలను సరిగ్గా అమలు చేసి, ప్రజలతో సరైన పద్ధతిలో నడుచుకొని ఉంటే జగన్ కు ఈ స్థాయిలో ఓటమి వచ్చి ఉండేది కాదు. అంతే కాకుండా  మూడు రాజధానుల అంశం కూడా జగన్ మైనస్ గా మారింది. దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  టిడిపి అనూహ్యంగా తెరపైకి తేవడంతో  అది కూడా జగన్ కు మైనస్ అయిపోయింది. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో చూసిన  ఒక్కరు లేరా ఇద్దరు లీడర్లు మాత్రమే పెత్తనం చెలాయించి మిగతా వారు ఎవరు కూడా  ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలవనిచ్చేవారు కాదట.  వైసీపీలోని సొంత పార్టీ నాయకులకే ఒక్కోసారి ఎమ్మెల్యే కలవకుండా చేసేవారట, కొంతమంది చోటామోటా లీడర్లు.  దీనివల్ల చాలావరకు వైసీపీ క్యాడర్ అంతా టీడీపీ వైపు మొగ్గు చూపింది. పైకి మాత్రం మన కేడర్ మనకే ఉందంటూ జగన్ ను నమ్మిస్తూ చివరికి కిందిస్థాయి లీడర్లే ఆయన పతనానికి కారకులయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: