మనల్ని ఎవడ్రా ఆపేది..రెండు స్థానాల్లోనూ రాహుల్‌గాంధీ విజయం..?
ఇప్పటివరకు కౌంటింగ్ జరిగిన స్థానాలను పరిశీలిస్తే... దేశవ్యాప్తంగా 296 స్థానాలలో లీడింగ్ సంపాదించింది ఎన్డీఏ కూటమి. ఇటు కాంగ్రెస్ కూటమి 229 స్థానాలలో లీడింగ్ సంపాదించడం మనం చూస్తున్నాం. ఇతర పార్టీలు 18 సీట్లు లీడింగ్ లో ఉన్నాయి. అయితే... గత పది సంవత్సరాలలో అధికారం కోల్పోయిన.... కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఇచ్చేలా... ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారం రాకపోయినా సరే... కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందని ఈ ఎన్నికలు సంకేతాన్ని ఇచ్చాయి.
అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన విజయాలను నమోదు చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయి బరేలి నియోజకవర్గంలో ఈసారి కొత్తగా రాహుల్ గాంధీ పోటీ చేశారు. అక్కడ బిజెపి అభ్యర్థిని తుక్కుతుక్కుగా ఓడించి విజయం సాధించారు రాహుల్ గాంధీ. రాయబరేలి లో 3.7 లక్షలకు పైగా మెజారిటీతో బిజెపి పార్టీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పై విజయం సాధించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.
ఇక కేరళలోని వయనాడు నియోజకవర్గం నుంచి రెండవసారి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అక్కడ కూడా అఖండ విజయాన్ని నమోదు చేశారు రాహుల్ గాంధీ. తమ సిపిఐ అభ్యర్థి యాని రాజాపై 3.5 లక్షలకు పైగా మెజారిటీతో... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గ్రాండ్ విక్టరీ కొట్టారు. దీంతో ఒకేసారి రాహుల్ గాంధీ రెండు చోట్ల విజయం సాధించడం జరిగింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.