తాడిపత్రి: మళ్లీ అడ్డా మాదే అని నిరూపించిన జేసీ కుటుంబం..!

Divya

ఫ్యాక్షన్ గడ్డ.. గొడవలకు అడ్డా.. ఇలాంటి ఈ ప్రాంతంలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫ్యాక్షనిజాన్ని తలపించింది.. అటువైపు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దిరెడ్డి బరిలోకి దిగగా.. మరొకవైపు టిడిపి నుంచి ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత కొన్ని దశాబ్దాలుగా టిడిపికి కంచుకోటగా మారిన తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి 2019 ఎన్నికల్లో 7511 ఓట్ల  మెజారిటీతో గెలుపొందారు.. అయితే ఇప్పుడు ఎలాగైనా సరే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని ఓడించి మళ్లీ తమ కంచుకోట ను మరింత పదిలం చేసుకునే ప్రయత్నంలో భాగంగా.. అసలు ప్రచారానికే వెళ్ళని ప్రభాకర్ రెడ్డి,  దివాకర్ రెడ్డి కుటుంబాలు ఈసారి గెలుపొందాలని  గడపగడపకు వెళ్లి ప్రచారాలు చేపట్టారు..
ఈ నేపథ్యంలోనే అటు కేతిరెడ్డి పెద్దిరెడ్డి పై కూడా ప్రజలలో మంచి అభిప్రాయాలు ఉన్నాయి.. ఎందుకంటే గతంలో టిడిపి హయాంలో నిలిచిపోయిన ఎన్నో ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు.. ఎన్నో మంచి పనులు చేపట్టిన కేతిరెడ్డి పెద్దిరెడ్డి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తుండగా.. లేదు తమ కంచుకోటని మళ్లీ తమ స్వాధీనం చేసుకుంటామని మరొకవైపు టిడిపి నేతలు కూడా పోటీ పడుతున్నారు.. పైగా తక్కువ మెజారిటీతోనే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో.. ఇప్పుడు టిడిపి గెలుపుకి కష్టపడాల్సిన అవసరం లేదన్నట్టుగా తెలుస్తోంది.. అలాగే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా జెసి ప్రభాకర్ రెడ్డి తొడకట్టి మరీ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. ఇక ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలిచి తీరుతామని తన కొడుకు అస్మిత్ రెడ్డిని బరిలోకి దిగారు.. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు ఉండగా.. చాలామంది ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారన్నది కౌంటింగ్ లో తేలనున్నది.

మరి ఇంత హోరాహోరీగా సాగుతున్న పోరులో.. తాజాగా జరిగిన కౌంటింగ్లో ఫైనల్ గా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పై జేసీ అస్మిత్ రెడ్డి 27,068 ఓట్లతో గెలుపొందారు. దీంతో మరొకసారి తాడిపత్రిలో తమ దే హవా ఆనిరూపించారు జేసి కుటుంబం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: