నందిగామ : వైసీపీ బ్ర‌ద‌ర్స్‌కు మైండ్ పోయేలా షాక్ ఇచ్చిన సౌమ్య‌... సూప‌ర్ విక్ట‌రీ..!

RAMAKRISHNA S.S.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం కృష్ణాజిల్లాలోని నందిగామ ఒకటి. 1994, 1999, 2004 2009, 2014, 2015 ఉపఎన్నికలలో వరుసగా ఆరు సార్లు గెలిచిన తెలుగుదేశం.. 2019 ఎన్నికలలో చాలా ఏళ్ల తర్వాత ఓడిపోయింది. 2004లో సైతం నందిగామలో తెలుగుదేశం విజయం సాధించింది. నందిగామ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ తో పాటు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి పెట్ట‌నికోట‌.. ఇక్క‌డ నందిగామ , వీరుల‌పాడు, చంద‌ర్ల‌పాడు, కంచిక‌చ‌ర్ల మండ‌లాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అత్యంత సురక్షితం అయిన కంచుకోట లాంటి నియోజకవర్గంలో నందిగామ ఒకటి. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో డాక్టర్ గా పేరున్న మొండితోక జగన్మోహన్ రావు విజయం సాధించి.. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే మొండితోక ఫ్యామిలీకి పట్టిందల్లా బంగారం అయింది.

జగన్మోహన్‌రావు సోదరుడు అరుణ్ కుమార్ ముందు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అవ్వటం.. ఆ వెంటనే ఎమ్మెల్సీ అవ్వటం.. చకచకా జరిగిపోయాయి. అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావటంతో నియోజకవర్గంలో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరు ఒంటెద్దు పోకడలతో కొన్ని విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. గత ఎన్నికలలో ఓడిన తంగిరాల సౌమ్య ఐదేళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పాత ప్రత్య‌ర్దులే మళ్ళీ తలపడడంతో నందిగామలో పోటీ తీవ్రంగానే కనిపించింది. అయితే ఎన్నికలకు ముందు ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుందని ఎక్కువ సర్వేలు వెల్లడించాయి.

వ‌రుస‌గా ఆరు సార్లు గెలిచిన త‌న కంచుకోట‌లో తెలుగుదేశం ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి దూసుకు పోయింది. సౌమ్య‌కు గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఏకంగా 27 వేల ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. మ‌రోసారి నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోట అని ఫ్రూవ్ అయ్యింది. ఇక సౌమ్య ఇది రెండో సారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. మొత్తానికి మొండి తోక సోద‌రులు ఇద్ద‌రికి కూడా ఈ ప‌రాజ‌యం పెద్ద షాకే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: