నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం లో టీడీపీ అభ్యర్థి గ్రాండ్ విక్టరీ సాధించాడు..సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో గెలుపు రుచి చూసి 20 సంవత్సరాలు అయింది.. దాదాపు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఒడిపోతూ వస్తున్నారు.ఆరోసారి టీడీపీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.టీడీపీ కూటమి ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలో ఆరోసారి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. సర్వేపల్లి నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్దన్ రెడ్డి మీద ఆయన 14 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలలో వున్నారు.. 1994 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.చంద్రబాబు మంత్రి వర్గంలో సోమిరెడ్డి ఐదు శాఖలకు మంత్రి గా వ్యవహరించారు.
1999లో కూడా సోమిరెడ్డి రెండోసారి గెలిచి మళ్లీ మంత్రి పదవిని అందుకున్నారు. కానీ ఆ తర్వాత వైఎస్సార్ ముఖ్యమంత్రి కావడం తో 2004 మరియు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు.అలాగే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన కాకాని గోవర్దన్ రెడ్డి చేతిలో కూడా ఘోర ఓటమి తప్పలేదు.2019లో టీడీపీ ఘోర పరాజయం పాలయింది.దీనితో ఈసారిఎన్నికలలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావించింది.ఈ క్రమంలో మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని నారా లోకేశ్ ఫ్రకటించారు. దీంతో సోమిరెడ్డి టికెట్‌పై విషయం అయోమయంగా మారింది.తొలి రెండు జాబితాల్లో ఆయన పేరును ప్రకటించలేదు. అయితే చంద్రబాబుతో వున్న అనుబంధంతో ఆయన ఎలాగోలా టికెట్ సంపాదించిన సోమిరెడ్డి ఇవే తనకు ఆఖరు ఎన్నికలని ప్రజలను వేడుకున్నారు.చివరకు సోమిరెడ్డిని ప్రజలు 15,994 భారీ మెజారిటీతో గెలిపించారు.