మ‌చిలీప‌ట్నం : పాపం పేర్ని వార‌సుడు... కొల్లు ర‌వీంద్ర చేతిలో ఘోర ఘోర అవ‌మానం..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 నియోజకవర్గాలలో అత్యంత ఆసక్తి రేపే హాట్ సీట్లలో కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం కూడా ఒకటి. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో మాజీ మంత్రి పేర్ని నాని గట్టి పోటీ మధ్య.. స్వల్ప తేడాతో విజయం సాధించారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొల్లు ర‌వీంద్ర‌పై నాని గెలిచారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో పేర్నికి మంత్రి ప‌ద‌వి కూడా వ‌చ్చింది. బందరులో జనసేన - కాపు సామాజిక వర్గం ఓటర్లు .. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉండడంతో.. గత ఎన్నికల్లో జనసేన అక్కడ గట్టి ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే పేర్ని నాని ముక్కోణ‌పు పోటీలో స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. అయితే ఈ ఎన్నికలలో ప్రత్యర్థులు మారారు. 2014, 2019 ఎన్నికలలో కొల్లు రవీంద్ర, పేర్ల నాని పరస్పరం తలపడ్డారు.

అయితే ఈసారి రాజకీయాలకు స్వస్తి పలికిన పేర్ని నాని.. తన వారసుడుగా పేర్ని కిట్టును రంగంలోకి దింపారు. వైసీపీ నుంచి పేర్ని కిట్టు తెలుగుదేశం నుంచి కొల్లు రవీంద్ర పోటీ పడ్డారు. బందరు నియోజకవర్గంలో బందరు కార్పొరేషన్ తో పాటు.. బందరు మండలాలు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ఏడాది ముందు నుంచి బందరులో ఈసారి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. పేర్ని నాని భారీ మెజార్టీతో ఓడిపోబోతున్నారంటూ అన్ని సర్వేలు చెప్పకనే చెప్పాయి. కృష్నా జిల్లాలో జ‌న‌సేన + టీడీపీ కూట‌మి చాలా ప్ర‌భావంగా చూపించిన నియోజ‌క వ‌ర్గాల్ల‌లో బంద‌రు కూడా ఉంది.

అయితే చివర్లో సీటు దక్కించుకున్న పేర్ని కిట్టు గట్టి పోటీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇక ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో బంద‌రు గ‌డ్డ నా అడ్డా అని కొల్లు ర‌వీంద్ర ఫ్రూవ్ చేసుకున్నారు. ఏకంగా బంద‌రు చ‌రిత్ర‌లోనే రికార్డు బ్రేక్ చేస్తూ 50242 ఓట్ల మెజార్టీతో సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఈ విజ‌యం తో పేర్ని నాని వార‌సుడికి పెద్ద దెబ్బే త‌గిలిన‌ట్ల య్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: